వీడియో: దక్షిణాఫ్రికాలో గాంధీజీ వారసులు

2018 అక్టోబర్ 2, మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ 150వ జయంతి. మహాత్ముడిగా మన్ననలు అందుకున్న గాంధీజీని ప్రజలు ప్రేమగా 'బాపూ' అని పిలిచారు. భారతదేశం ఆయనను 'జాతిపిత' అని గౌరవించింది.

అహింసకు, సత్యాగ్రహానికి ఆద్యుడు గాంధీజీ. బ్రిటిష్ పాలకులకు పక్కలలో బల్లెంలా మారిన సత్యాగ్రహ ఆయుధం ఆయన దక్షిణాఫ్రికాలో ఉన్నపుడే పుట్టింది.

గాంధీజీ 21 ఏళ్లు గడిపిన దక్షిణాఫ్రికాలో ఇంకా ఆయన వారసత్వం మిగిలి ఉందా? అక్కడి ప్రజలు ఇంకా ఆయనను తల్చుకుంటున్నారా?

దీనిని తెలుసుకోవడానికి మేం కొన్నాళ్ల క్రితం భారతదేశం నుంచి అక్కడికి వెళ్లాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)