ఈ శతాబ్దపు సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎప్పుడు, ఎక్కడ చూడబోతున్నాం?

వీడియో క్యాప్షన్, ఈ శతాబ్దపు సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎప్పుడు ఎక్కడ చూడబోతున్నాం?

మునుపెన్నడూ చూడనంతటి ప్రత్యేకమైన చంద్ర గ్రహణాన్ని శుక్రవారం అర్ధరాత్రి దాటాక చూడబోతున్నాం. జులై 27, 2018న ఇది ఏర్పడుతోంది.

ఈ శతాబ్దంలో ఇదే అత్యంత సుదీర్ఘమైన సంపూర్ణ చంద్ర గ్రహణమని నాసా చెబుతోంది.

మొత్తం గంటా నలభై మూడు నిమిషాల పాటు ఇది ఉంటుంది.

అసలు సంపూర్ణ చంద్ర గ్రహణం అంటే ఏమిటి?

సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. అంటే.. సూర్యచంద్రుల మధ్య భూమి ఉండడం వల్ల సూర్యరశ్మి చంద్రుడిపై పడక అది భూమిపై ఉన్నవారికి కనిపించకుండా పోవడమే చంద్ర గ్రహణం.

ఇంకోమాటలో చెప్పాలంటే భూమి చుట్టూ నిత్యం పరిభ్రమించే చంద్రుడు భూమి నీడలోంచి వెళ్లినప్పుడు ఇలా జరుగుతుంది.

జులై 27న ఏర్పడుతున్న చంద్రగ్రహణ వివిధ దశల్లో మొత్తంగా 3 గంటల 55 నిమిషాల పాటు ఉంటుంది. అందులో 1.43 గంటల పాటు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)