బీబీసీ పరిశోధన: మియన్మార్ సైన్యంపై మరోసారి ఆరోపణలు

వీడియో క్యాప్షన్, బీబీసీ పరిశోధనలో వెల్లడైన మరో వాస్తవం

మియన్మార్ సైన్యం అమాయక ప్రజల ప్రాణాలు తీస్తోందన్న ఆరోపణలు పాతవే. తాజాగా కచిన్ రాష్ట్రంలో అది రెబెల్స్ పేరుతో సామాన్యులను తరిమేస్తోందని బీబీసీ పరిశోధనలో తేలింది.

రొహింజ్యా ముస్లింల విషయంలో జాతి నిర్మూలనకు పాల్పడుతున్నారని సాక్షాత్తు ఐక్యరాజ్య సమితి కూడా ఆరోపించింది. ఇవి ఇలా ఉండగానే... మియన్మార్ సైన్యం పాల్పడుతున్న మరో దారుణాన్నిబీబీసీ పసిగట్టింది.

దేశానికి ఉత్తరాన ఉన్న కచిన్ రాష్ట్రంలోని సామాన్యుల్ని రెబల్స్ పేరుతో సైన్యం అక్కడ నుంచి తరిమేస్తోంది. కేవలం సాయుధ శత్రువుల్నే లక్ష్యంగా చేసుకుంటున్నామని సైన్యం చెబుతున్నా, వాస్తవం మాత్రం మరోలా ఉంది.

దీనిపై ప్రభుత్వ స్పందన తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)