మహిళా సమస్యలపై వీడియో గేమ్స్ రూపొందిస్తున్న పాకిస్తానీ యువతి
సాదియా బషీర్ తన ఇంట్లోవాళ్ళను ఎదిరించి మరీ కోఎడ్యుకేషన్ విద్యా సంస్థలో కంప్యూటర్ సైన్స్ చదువుకున్నారు. ఆ తరువాత డిగ్రీలో ఉండగా ఆమెకు హెచ్ఈసీ స్కాలర్‌షిప్ వచ్చింది. సొంతంగా ప్రోగ్రామింగ్ నేర్చుకుని, గేమ్ డెవలపర్ అయ్యారు.
సామాజిక సమస్యలు, మహిళా సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రోగ్రామ్స్ తయారు చేయడం ఆమెకు అత్యంత ఇష్టమైన వ్యాపకంగా మారిపోయిది. క్యాన్సర్‌ను నిర్థారించే యాప్, నీటి కాలుష్యాన్ని గుర్తించే యాప్ ఇలా ఆమె ప్రజలకు ఉపయోగపడే ప్రోగ్రామ్స్ అభివృద్ధి చేశారు.
ప్రస్తుతం ఆమె వీడియో గేమ్ డిజైన్ అకాడమీని నడిపిస్తున్నారు. తీవ్రమైన పోటీ ఉండే ఈ రంగంలో తమ ముద్ర వేయాలనుకునే ఉత్సాహవంతులకు శిక్షణ ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)