చైనాను నిలువరించాలంటే భారత్, వియత్నాం దగ్గరవ్వాల్సిందే!
వియత్నాం ఆసియాలో అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న దేశం. దక్షిణ చైనా సముద్ర తీరంలోని ఈ దేశంతో భారతదేశానికి దీర్ఘకాలంగా మంచి సంబంధాలున్నాయి.
ఈ బంధం కేవలం దౌత్యానికి మాత్రమే పరిమితం కాదు. రెండు దేశాల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించింది కూడా.
ఈ అనుబంధంపై బీబీసీ ప్రతినిధి జుబైర్ అహ్మద్ అందిస్తున్న కథనం.
వియత్నాంలో నివసించే రవి కుమార్ కుటుంబానికి చాలా ప్రత్యేకత ఉంది. కుమార్ పూర్వీకులది కర్ణాటక రాష్ట్రం.
ఆయన భార్యది హనోయి. 28 ఏళ్ల కిందట వీరి మధ్య చిగురించిన ప్రేమ రెండు దేశాల సంస్కృతులు, సంప్రదాయాల మధ్య వారధిగా నిలిచింది.
"మా కుటుంబం రెండు దేశాలకు ప్రతీక. ఇక్కడే ఉంటున్నందు వల్ల వియత్నాం ప్రభావం ఎక్కువ. మా పిల్లలకు కన్నడ రాదు. అయితే భారతదేశ వంటకాలను చాలా ఇష్టపడతారు. కుమార్ సోదరుడు కూడా వియత్నాం మహిళను పెళ్లి చేసుకున్నాడు. రెండు దేశాల మధ్య మంచి వాతావరణం ఉన్నా, భారతీయులు, వియత్నాం ప్రజల మధ్య వైవాహిక సంబంధాలు చాలా అరుదు" అని రవికుమార్ అన్నారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలపై మరిన్ని విశేషాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)