చీర కట్టుకుని స్కై డైవింగ్!

వీడియో క్యాప్షన్, చీర కట్టుకుని స్కై డైవింగ్!

13,000 అడుగుల ఎత్తు నుంచి సీతల్ మహాజన్‌ స్కై డైవింగ్ చేశారు. ఇందులో వింతేమీ లేదు. కానీ చీర కట్టుకుని ఆమె స్కై డైవింగ్ చేశారు.

చీర అంటే మామూలు చీర కాదు.. 9 గజాల పొడవైన చీర.

దీన్ని నవ్‌వారీ చీర అంటారు. నవ్‌వారీ చీర కట్టుకోవడం మహారాష్ట్రలో సంప్రదాయం.

మహారాష్ట్రలోని పుణెకు చెందిన సీతల్ మహాజన్‌ థాయ్‌లాండ్‌లోని పటాయాలోని స్కై డైవింగ్ కేంద్రంలో ఈ ఫీట్ చేశారు.

గతంలో అంటార్కిటికా దక్షిణధ్రువం వద్ద మైనస్ 38డిగ్రీల ఉష్ణోగ్రతలో 11,600 అడుగుల ఎత్తు నుంచి సీతల్ ఫ్రీ ఫాల్ జంప్ చేశారు.

ఉత్తర ధ్రువం వద్ద మైనస్ 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో 2400 అడుగుల ఎత్తు నుంచి పారాచూట్ జంప్ చేసిన తొలి మహిళ కూడా ఈమె.

సీతల్ మహాజన్‌ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.