మహిళా సైనికులకూ, పురుషులకూ ఒకే టాయిలెట్!
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక బలగాలు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో 'బ్లూ హెల్మెట్' మిషన్ పేరుతో ప్రత్యేక దళాలను ఐరాస మోహరించింది.
కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ దేశంలో శాంతి పరిరక్షణ కోసం ఐరాస 15,114 మందిని పంపింది.
అందులో మహిళలు 723 మంది మాత్రమే. వారిలో జాంబియా రాజధాని లుసాకా నుంచి వచ్చిన 35 ఏళ్ల మేజర్ కయాండ ఒకరు.
ఇంతకూ ఈ మహిళా శాంతి పరిరక్షకుల దినచర్య ఎలా ఉంటుంది? పురుషాధిక్య దళంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? వీరిపట్ల స్థానికులు ఎలా ప్రవర్తిస్తారు? వంటి విషయాలు తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది.
అందుకోసం ఐక్యరాజ్య సమితి నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని మేజర్ మిషెల్లీ ఎమ్విజీ కయాండతో మాట్లాడింది.
ఆమె ఏమంటున్నారో పై వీడియోలో చూడొచ్చు.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)