కృత్రిమ కాంతితో సహజ సౌందర్యం కోల్పోతున్న రాత్రుళ్లు
కాంతి కాలుష్యంతో రాత్రిని, చీకటికుండే సహజమైన సౌందర్యాన్ని కూడా కోల్పోతున్నామా? దీనికి సమాధానం అవుననే వస్తోంది.
ఎందుకంటే భూమ్మీద రానురానూ రాత్రిపూట వెలుతురు పెరిగిపోతోందని నాసా ఛాయాచిత్రాలు చెబుతున్నాయి. రోజురోజుకీ కృత్రిమ వెలుగులు పెరుగుతుండటంతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
పట్టణ ప్రాంతాల్లో సూర్యుడు అస్తమించిన వెంటనే లైట్లు వెలిగిపోతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
బ్రిటన్, యూరప్‌లోని పట్టణ ప్రాంతాల్లో వెలుతురు మరింత పెరిగింది.
భారత్‌లో కూడా 2012 నుంచి 2016 వరకూ రాత్రి పూట గణనీయంగా వెలుతురు పెరుగుతూ వచ్చింది. కృత్రిమ కాంతి కారణంగా చీకట్లలో ఉండే సహజమైన సౌందర్యం దూరమవుతోంది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)