ఇండోనేషియా యువరాణి పెళ్లి.. రిక్షా ఎక్కిన దేశాధ్యక్షుడు

ఇండొనేషియా ప్రెసిడెంట్ జోకో వీడోడో కుమార్తె వివాహం ‘జావనీస్’ సంప్రదాయం ప్రకారం జరిగింది. దీనిని చూడటానికి దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోయిందట.

పెళ్లి ఊరేగింపులో కహియాంగ్ అయు
ఫొటో క్యాప్షన్, ఇండొనేషియాలో ఓ పెళ్లి ధూమ్‌ధామ్‌గా జరిగింది. ఆ సందడిలో పెళ్లి కూతురు మురిసిపోతూ మెరిసిపోతోంది. ఈమె ఎవరంటారా? ఇండొనేషియా ప్రెసిడెంట్ జోకో వీడోడో ఏకైక కుమార్తె ‘కహియాంగ్ అయు’. ఈమె వివాహం ‘జావనీస్’ సంప్రదాయం ప్రకారం జరిగింది. ఈ పెళ్లి సందడి చూడటానికి దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోయింది.
పెళ్లి ఊరేగింపు
ఫొటో క్యాప్షన్, రాజకీయ నాయకులతోపాటు ఈ పెళ్లికి దాదాపు 8.000 మంది అతిథులను ఆహ్వానించారు. కానీ అంతర్జాతీయ నేతల పేర్లు అతిథుల జాబితాలో లేవు.
ఇండొనేషియా ప్రెసిడెంట్ జోకో వీడోడో తన భార్యా కుమార్తెలతో

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, పెళ్లికి ముందురోజు సాయంకాలం జావనీస్ సంప్రదాయాల ప్రకారం ప్రెసిడెంట్ దంపతులు తమ కూతురితో కొన్ని ఆచారాలను జరిపించారు.
తన భార్యతో జోకోవీ
ఫొటో క్యాప్షన్, ప్రెసిడెంట్ స్వస్థలం సురకర్త పట్టణంలో బుధవారం నాడు పెళ్లి జరిగింది. ఈ పెళ్లిలో ఓ భారీ ఊరేగింపును కూడా ఏర్పాటుచేశారు.
ఇండొనేషియా ప్రెసిడెంట్ జోకో వీడోడో అల్లుడు
ఫొటో క్యాప్షన్, పెళ్లికొడుకు పేరు మహమ్మద్ బాబీ అఫిఫ్ నసుషన్. ఇతను బాతాక్ వర్గానికి చెందినవారు. ఈయన స్థిరాస్థి వ్యాపారి.
తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తోన్న కహియాంగ్ అయు

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, కహియాంగ్ అయు వయసు 26 సంవత్సరాలు. విడోడో ముగ్గురు సంతానంలో ఆమె ఒకరు. ఈమెకు ఒక అన్న, తమ్ముడు ఉన్నారు.
జోకో వీడోడో కూతురి పెళ్లి ఊరేగింపు
ఫొటో క్యాప్షన్, పెళ్లినాడు జరిగిన ఊరేగింపు అందరికీ కనువిందు చేసింది. ఇండొనేషియా దేశంలోని అన్ని వర్గాలు, జాతుల వస్త్రధారణలతో మహిళలు ఊరేగింపులో పాల్గొన్నారు. దేశంలోని భిన్నత్వాన్ని ఈ ఊరేగింపు ప్రతిబింబించింది.
జోకో వీడోడో కూతురి పెళ్లి ఊరేగింపు
ఫొటో క్యాప్షన్, ఈ ఊరేగింపు కోసం ప్రెసిడెంట్ విడోడో 50 రిక్షాలను అద్దెకు తీసుకున్నారు. పెళ్లికి వచ్చిన అతిథులు ఈ రిక్షాల మీదనే నవదంపతులను అనుసరించారు. సమాజంలోని అన్ని వర్గాలనూ ఈ పెళ్లిలో భాగం చేయాలని, పేదలకు డబ్బును వేతన రూపంలో అందించాలన్నది ఈయన ఉద్దేశ్యమని బీబీసీ ప్రతినిధి తెలిపారు.
జోకో వీడోడో
ఫొటో క్యాప్షన్, 2014లో ప్రెసిడెంట్ కాకమునుపు.. జోకో వీడోడో సురకర్త పట్టణానికి మేయర్‌గా పనిచేశారు. అనంతరం జకార్తా గవర్నర్ అయ్యారు. ‘జొకోవీ’ గానే ఈయన ఇండొనేషియాలో ప్రసిద్ధుడు.