తిరుపతిలోని ఈ శిక్షణా సంస్థలో గడిచిన పన్నెండేళ్లుగా వేలాది మంది శిక్షణ పొందారు.

ఎంతో మంది గ్రామీణ మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది తిరుపతిలోని సీడాప్- డీఆర్డీఏ. పలు విభాగాల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేస్తోంది. ఈ శిక్షణా సంస్థలో గడిచిన పన్నెండేళ్లుగా వేలాది మంది శిక్షణ పొందారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రారంభమైన ఈ సంస్థలో టెన్త్ పాసైన మహిళలకు ఉచితంగా శిక్షణ, వసతి, ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తారు.

సీడాప్ అంటే సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైస్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రాష్ట్రస్థాయి నోడల్ ఏజెన్సీ. జిల్లా స్థాయిలో DRDA ఉంటుంది. ఈ రెండు సంస్థలు కలిసి సంయుక్తంగా శిక్షణ ఇస్తుంటాయి. తిరుపతిలో ఉన్న కేంద్రంలో మహిళలకు మాత్రమే శిక్షణ ఇస్తారు.

ఇక్కడ శిక్షణ పొందిన మహిళలు కొందరు ఉద్యోగాలు చేస్తుంటే.. మరికొందరు స్వయం ఉపాధిని ఎంచుకున్నారు. ఉచితంగా శిక్షణ ఇవ్వడంతో పాటు ఈ సంస్థే ఉపాధి అవకాశాలు కూడా చూపిస్తుంది.

తిరుపతిలో 2010లో దీన్ని ప్రారంభించారు. ఇప్పటివరకు 4వేల మంది శిక్షణ పొందగా 85శాతం మందికి ఉపాధి కల్పించినట్లు అధికారులు చెబుతున్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ఈ కేంద్రానికి 2022లో స్కోచ్ సిల్వర్ అవార్డు వచ్చింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)