అన్నమయ్య ప్రాజెక్టు బాధితులు ఏడాది తర్వాత ఎలా ఉన్నారు-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

వీడియో క్యాప్షన్, అన్నమయ్య ప్రాజెక్టు బాధితులు ఏడాది తర్వాత ఎలా ఉన్నారు-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

"డ్యాం తెగడంతో మా ఊరికిపైకి వెల్లువొచ్చింది. మా ఇళ్లన్నీ కొట్టుకుపోయాయి. సంవత్సరం అవుతున్నా ఇంతవరకు ఇళ్లు కట్టివ్వలేదు. వానకు, గాలికి గుడిసెలోనే ఉంటున్నాం. నేను గర్భవతిని, నా చిన్న బిడ్డలతో ఈ గుడిసెలోనే ఉంటున్నా. వానొస్తే గుడిసెలోకి నీళ్లొస్తాయి. సామాన్లన్నీ తడిసిపోతాయి. పాములు తేళ్లు కూడా లోపలికి వస్తుంటాయి.''

దాదాపు ఏడాది క్రితం అప్పటి కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు తెగడంతో వరదలకు అన్నీ కోల్పోయిన ఓ బాధితురాలి ఆవేదన ఇది.

కడప జిల్లాలోని రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం, చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలను కలిపి అన్నమయ్య జిల్లాను ఏర్పాటు చేయడంతో ఈ ప్రాజెక్టు ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోకి వచ్చింది.

పది వేల ఎకరాలకు పైగా సాగునీరు, రాజంపేట మున్సిపాలిటీ సహా మరో 18 గ్రామాలకు తాగునీరు అందించే ఉద్దేశంతో నిర్మించిన అన్నమయ్య ప్రాజెక్టు 2021 నవంబర్ 19న ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు శాపంగా మారింది.

తెల్లవారుజామున అన్నమయ్య ప్రాజెక్టుకు గండి పడడంతో నీళ్లు రాజంపేట మండలంలోని పులపత్తూరు, తొగురుపేట, మందపల్లి, రామచంద్రాపురం గ్రామాలను పూర్తిగా ముంచెత్తాయి.

ఈ వరదల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 33 మంది మృతిచెందడంతో పాటు కొందరు గల్లంతయ్యారు. చాలామంది గ్రామస్థులు ప్రాణాలకు తెగించి అక్కడ నుంచి బయటపడగా, చెయ్యేరు పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలపై కూడా వరద ప్రభావం తీవ్రంగా పడింది.

మరి ఏడాది తర్వాత వాళ్ల పరిస్థితి ఎలా ఉంది? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్‌ను ఈ వీడియో కథనంలో చూడండి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)