You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లఖీంపుర్ ఖీరీ: దళిత అక్కాచెల్లెళ్ళు చెట్లకు వేలాడుతూ కనిపించారు, అసలేం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపుర్ ఖీరీ జిల్లాలో దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు చెట్టుకు వేలాడుతూ కనిపించిన ఘటన కలకలం రేపింది.
ఇద్దరూ మైనర్ బాలికలే. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.
అయితే, బాలికలను అపహరించినట్టు లేదా ఊరి బయటకి బలంతంగా ఎత్తుకెళ్లినట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పోలీసులు అంటున్నారు.
బాలికల మరణవార్త వెలుగుచూడగానే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్థులు గంటల తరబడి రోడ్డుపై బైఠాయించారు.
ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలపై ప్రశ్నిస్తూ ఇతర రాజకీయ పార్టీలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని నిలదీశాయి.
ఇది ప్రభుత్వ వైఫల్యమని మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతి, కాంగ్రెస్ అధినేత్రి ప్రియాంక గాంధీ ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
- బీజేపీ నేత, మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు అయిదేళ్ల జైలు శిక్ష, ఆమె భర్తకు కూడా...అసలు కేసు ఏంటి?
- ఊబకాయులు తెలంగాణలో ఎక్కువా, ఆంధ్రలో ఎక్కువా? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ఏం చెప్పింది
- తెలంగాణలో ఆయిల్ పామ్: ప్రభుత్వ ప్రణాళికతో వంటింటి నూనె ఖర్చు, దిగుమతి బిల్లులు తగ్గుతాయా?
- అజర్బైజాన్, అర్మేనియా వార్: సోమవారం తాజా ఘర్షణల్లో 100 మంది చనిపోయారు..అసలు ఈ దేశాల మధ్య యుద్ధం ఎందుకు వచ్చింది, చరిత్ర ఏమిటి?
- SCO: గల్వాన్ లోయ ఘర్షణ తర్వాత తొలిసారి భేటీకానున్న మోదీ, షీ జిన్పింగ్, రెండు దేశాల సంబంధాలలో మార్పులు వస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)