సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది మృతి

వీడియో క్యాప్షన్, సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మరణించారు.

సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మరణించారని, ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియలేదని హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు.

సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భవనంలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

బేస్‌మెంట్‌లో మంటలు వ్యాపించాయని, మంటల కంటే ఎక్కువగా దట్టమైన పొగ వ్యాపించడంతో కొందరు ఊపిరి అందక స్పృహ కోల్పోయారని, కొందరు భవనం నుంచి కిందకు దూకారాని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)