రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్న తల్లి పక్కన ఉన్న బిడ్డ అపహరణ

వీడియో క్యాప్షన్, రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్న తల్లి పక్కన ఉన్న బిడ్డ అపహరణ

ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్. నిద్రపోతున్న తల్లి పక్కనున్న బిడ్డను ఒక వ్యక్తి ఎత్తుకెళ్తున్నాడు. ఆగస్టు 24న బుధవారం ఇది సీసీటీవీలో రికార్డయ్యింది.

ఆదివారం నాడు పోలీసులు ఈ బిడ్డను ఫిరోజాబాద్ బీజేపీ కౌన్సిలర్ ఇంట్లో గుర్తించారు. మథురకు దాదాపు 100 కి.మీ దూరంలో ఉంటుంది ఫిరోజాబాద్. ఇద్దరు డాక్టర్లకు లక్షా 80 వేల రూపాయలిచ్చి బీజేపీకి చెందిన వినీతా అగ్రవాల్, ఆమె భర్త ఈ బిడ్డను కొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 8 మందిని అరెస్ట్ చేశారు. బిడ్డను ఎత్తుకుని పారిపోయిన వ్యక్తి కూడా వీరిలో ఉన్నారు.

పూర్తి వివరాల కోసం ఈ వీడియో‌ను చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)