Chess: గుజరాత్‌లోని ఆ ఊరికి చెస్ విలేజ్‌గా పేరు ఎలా వచ్చింది?

ఖాళీ దొరికితే చాలు పిల్లలు మొబైల్ ఫోన్స్ పట్టుకుంటున్న ఈ రోజుల్లో... వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆలోచించారు ఒక పాఠశాల సిబ్బంది.

తెలివితేటలతో పాటు, ఇండోర్ గేమ్స్ పట్ల ఆసక్తిని పెంచే ఉద్దేశంతో చెస్ బోర్డులు కొనిపెట్టి, ఎలా ఆడాలో కూడా వారికి నేర్పించారు.

దాంతో ఇప్పుడా ఊరు ఊరంతా చెస్ ఆడుతూ చెస్ విలేజ్‌గా పేరుతెచ్చుకుంది.

గుజరాత్‌లోని లాలావదర్ అనే ఆ గ్రామం విశేషాలేంటో బీబీసీ ప్రతినిధులు బిపిన్ టాంకరియా, రవి పర్మార్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)