Leh Ladakh Water Crisis: మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ఈ హిమాలయ పర్వత గ్రామాలకు నీరు చేరుతోందా?
దేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీటిని అందించాలనే లక్ష్యంతో మొదలైంది… జల్ జీవన్ మిషన్.
ప్రతి వ్యక్తికి రోజూ 55 లీటర్ల నీరు అందించాలనేది ఈ పథకం ఉద్దేశం.
కొండలపై ఉన్న గ్రామాలైనా, ఎడారి గ్రామాలైనా... అంతటికీ నీరు చేరాల్సిందే.
కానీ అలాంటి గ్రామాల్లో వాస్తవ పరిస్థితి ఎలా ఉంది?
నీటి సమస్యకు సంబంధించిన ఈ సిరీస్‌లో భాగంగా... ఈరోజు లద్దాఖ్ మంచు ఎడారి ప్రాంతాన్నుంచి అందిస్తున్న కథనం.
సమద్రమట్టానికి సుమారు 13 వేల అడుగుల ఎత్తులో ఉండే ఇక్కడి గ్రామాల్లోంచి బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య, దేబలిన్ రాయ్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్.
చలికాలంలో గడ్డ కట్టించే మైనస్ 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఈ ప్రాంతంలో ప్రజలు తాము రోజూ ఎంత నీరు వినియోగిస్తామో అంత నీరు మాత్రమే తెచ్చుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నీళ్లు దాచుకోవాలన్నా వాళ్లు చాలా కష్టపడాలి. కారణం.. నీళ్లు గడ్డకట్టేస్తాయి.
ఇవి కూడా చదవండి:
- చైనా ప్రభుత్వం స్పైడర్‌మ్యాన్ సినిమాను ఎందుకు నిషేధించింది? హాలీవుడ్ అంటే చైనాకు ఎందుకు పడదు?
- 'మీ భర్తను చంపటం ఎలా' అని రాసిన రచయిత్రికి భర్తను చంపిన కేసులో జీవితాంతం జైలు శిక్ష
- లామ్డా: ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్‌కి సొంత ఫీలింగ్స్ ఉన్నాయి అంటున్న గూగుల్ ఇంజనీర్
- ఏనుగు దంతాల అమ్మకాన్ని నిషేధించిన దశాబ్దం తర్వాత కూడా ‘ఈ-బే’లో కొనసాగుతున్న అమ్మకాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)