దిల్లీని పాలించిన ఔరంగజేబు సమాధిని మహారాష్ట్రలో ఎందుకు నిర్మించారు?

వీడియో క్యాప్షన్, దిల్లీని పాలించిన ఔరంగజేబు సమాధిని మహారాష్ట్రలో ఎందుకు నిర్మించారు?

ఏఐఎంఐఎం తెలంగాణ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఇటీవల ఔరంగాబాద్‌లో పర్యటించారు. అక్కడ ఆయన ఔరంగజేబు సమాధిని సందర్శించారు. దీంతో కొత్త రాజకీయ వివాదం రాజుకుంది.

ఔరంగాబాద్ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుల్తాబాద్ నగరంలో ఔరంగజేబు సమాధి ఉంది. దిల్లీని పాలించిన ఔరంగజేబు సమాధి మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు ఎలా వచ్చింది అనే సందేహం కలుగకమానదు.

ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ ఖుల్తాబాద్ వెళ్లాను. ఖుల్తాబాద్‌లోకి ప్రవేశించే ద్వారాన్ని నగార్‌ఖానా అంటారు.

సిటీ హాలులోకి ప్రవేశించగానే కుడివైపున ఔరంగజేబు సమాధి కనిపిస్తుంది. ఇది 'జాతీయ స్మారక చిహ్నం' అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన బోర్డు కూడా కనిపిస్తుంది.

సమాధిని దర్శించడానికి వెళ్లే ముందు బూట్లు, చెప్పులు బయట వదిలేయాలి. సమాధి ద్వారం దగ్గర షేక్ షుకూర్‌ని కలిశాను. పొద్దున్న పూట కావడంతో అక్కడ జనం పెద్దగా లేరు. ఔరంగజేబు సమాధిని దర్శించేందుకు ఒకరిద్దరు వచ్చారు.

వచ్చినవారికి సమాధి విశేషాలను చెబుతున్నారు షేక్ షుకూర్. ఔరంగజేబు సమాధి గురించి ఆయన చెప్పిన వివరాలు పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)