You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గురక.. నిద్రలోనే మీ ప్రాణాలు తీస్తుందా
ప్రముఖ సంగీత దర్శకులు బప్పిలహిరి, నిద్రలోనే మరణించడానికి కారణమైన స్లీప్ అప్నియా అనే వ్యాధి గురించి తెలుసా?
మీ గురకే మీకు ఎంత ప్రాణాంతకంగా మారుతుందో తెలుసా?
అబ్‌స్ట్రక్టీవ్ స్లీప్ ఆప్నియా - ఓఎస్‌ఏకు గురైతే ఏం జరుగుతుంది?
మనం నిద్రపోతున్నప్పుడు మన గొంతు కండరాలు విశ్రాంతి స్థితిలోకి వెళ్తాయి. గాలి నేరుగా మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది.
కానీ ఓఎస్‌ఏకు గురైనప్పుడు గొంతునాళం పూర్తిగా పూడుకుపోతుంది. దీనివల్ల గాలి లోపలికి వెళ్లలేదు. ఈస్థితిలో కొంతసమయం పాటు శ్వాస ప్రక్రియ ఆగిపోతుంది.
ఈ స్థితి 10 సెకన్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఉంటే దాన్ని 'ఏప్నియా'గా పరిగణిస్తారు.
ఇలా జరిగినప్పుడు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయి.
దాని ప్రభావం ఎలా ఉంటుంది?
ఈ వ్యాధి బారిన పడిన వారికి కొంత సమయం పాటు శ్వాస ప్రక్రియ నిలిచిపోతుంది. వెంటనే శ్వాస ప్రక్రియ మళ్లీ జరిగేలా మెదడు చూస్తుంది.
శ్వాసలో ఇబ్బంది ఏర్పడినప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకోనేందుకు ప్రయత్నించడం లేదా అటు ఇటు కదలడం వల్ల మళ్లీ శ్వాస తీసుకోవడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వ్యక్తి నిద్రలోకి జారుకుంటారు. కాసేపటి తర్వాత మళ్లీ ఇదే సమస్య మొదలవుతుంది.
కొంతమంది ఈ సమస్య తలెత్తగానే లేచి కూర్చుంటారు. కానీ మరికొంతమంది ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేక ఆందోళన చెందుతారు.
ఒకవేళ ఈ వ్యాధి ముదిరితే, ఒకే రాత్రిలో వందలసార్లు ఇలా శ్వాస సమస్య ఎదురవుతుంది.
దీనికారణంగా నిద్రకు తరచుగా అంతరాయం కలుగుతుంది. పగటి వేళంతా ఆ వ్యక్తికి మగతగా ఉంటుంది.
దీనికి చికిత్స పొందకపోతే, వ్యక్తి ప్రాణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుంది.
ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువ? ఓఎస్‌ఏ లక్షణాలు ఏంటి? పూర్తి వివరాలు పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్‌పై రష్యా దాడికి అనుకూలంగా ఉన్న మూడు ప్రధాన మార్గాలు ఇవే...
- మీకు ఓటు ఉందా, స్మార్ట్ ఫోను కూడా ఉందా.. అయితే మిమ్మల్ని ఏ రాజకీయ పార్టీ టార్గెట్ చేసిందో తెలుసా.. - డిజిహబ్
- తిరుమల పూటకూళ్ల మిట్ట చరిత్ర ఏంటి? కొండపై హోటళ్లు, రెస్టారెంట్లు తొలగించాలని టీటీడీ ఎందుకు నిర్ణయించింది?
- పోర్షె, ఆడి, లాంబోర్గిని, బెంట్లీ.. మొత్తం 4000 లగ్జరీ కార్లు అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో కాలిపోయాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)