కొండ చీలికలో చిక్కుకుపోయిన యువకుడిని ఇండియన్ ఆర్మీ ఎలా కాపాడిందంటే

కేరళలో నిటారుగా ఉన్న ఒక కొండపైకి ట్రెక్కింగ్‌కు వెళ్లి గాయపడి అక్కడే కొండచీలికలో చిక్కుకుపోయిన యువకుడిని భారత సైన్యం రక్షించింది.

దాదాపు గత 48 గంటలుగా ఆయన ఆహారం, నీరు లేకుండా గాయంతో కొండపైనే ఉండిపోయారు.

సోమవారం ముగ్గురు స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ చేస్తోన్న ఆర్ బాబు (23) కాలుజారడంతో కిందపడిపోయి కొండ సందులో ఇరుక్కుపోయారు.

తొలుత మూడు వేర్వేరు రెస్క్యూ బృందాలు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాయి. కానీ సఫలం కాలేకపోయాయి.

చివరకు భారత ఆర్మీ బుధవారం ఉదయం అతన్ని చేరుకోగలిగింది. ఆ తరువాత ఆర్మీ ఆయన్ను ఎలా కాపాడిందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)