తెలంగాణ: కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో బర్డ్ వాక్ ఫెస్టివల్... ఫోటో ఫీచర్

తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ ఆధ్వర్యంలో జనవరి 8,9 తేదీల్లో రెండో బర్డ్ వాక్ ఫెస్టివల్ జరిగింది. కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూర్, సిర్పూర్, పెంచికల్ పేట్, కాగజ్ నగర్ రేంజ్ ల పరిధిలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ కారిడార్లో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పక్షులు ప్రకృతి ప్రేమికుల్ని అలరించాయి. బర్డ్ వాక్ సందర్శనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడి అడవి అందాలను, సొగసైన పక్షులను తమ కెమేరాల్లో బంధించేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సందర్బంగా పెంచికల్ పేట్ మండలం నందిగామ వద్ద... పెద్దవాగు, ప్రాణహిత నదులు కలిసే చోట పాలరాపుగుట్టలో అంతరించేపోయే దశలో ఉన్న అరుదైన పొడుగు ముక్కు రాబందు కూడా కనిపించింది.