విమానం,హెలికాప్టర్‌లలో ప్రయాణించే ముందు ఆర్మీ అధికారులు పాటించాల్సిన నిబంధనలేంటి?
భారతదేశంలో వీఐపీల కోసం కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 2014లో 'ఎయిర్ సేఫ్టీ' సర్క్యులర్‌ను జారీ చేసింది. భద్రతా చర్యల్లో భాగంగా చిన్న విమానాలు, హెలీకాప్టర్లలో ప్రయాణించే వీఐపీలు ఈ సేఫ్టీ నిబంధనలను తప్పకుండా పాటించాలి.
ఎన్నికల సమయంలో నాయకులు, వీఐపీలు చిన్న విమానాలు, హెలీకాప్టర్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నందున ఈ జాగ్రత్తలు ప్రకటించారు.
వీఐపీ ప్రయాణ భద్రతా నియమాలు
పైలట్ కు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి
హెలిప్యాడ్ ఎంపిక సరిగ్గా ఉండాలి.
హెలికాప్టర్ దిగేందుకు అనువైన స్థలం ఉండాలి.
విమానం, హెలీకాప్టర్ సిబ్బందికి సరైన ప్రయాణ సమాచారం ఉండాలి. చెట్లు, హైటెన్షన్ వైర్లు, హెలిప్యాడ్‌లను సరిగ్గా తనిఖీ చేసుకోవాలి.
విమానం,హెలీకాప్టర్ ప్రయాణించే మార్గం, ప్రయాణీకుల సంఖ్య గురించి సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ సెంటర్ (ATC)కి తెలియజేయాలి.
ప్రయాణానికి ముందు వాతావరణం గురించి తెలుసుకోవాలి.
విమానం లేదా హెలీకాప్టర్ ఎక్కే ముందు వైద్య పరీక్ష తప్పనిసరి.
ఫ్లైట్ సామర్థ్యం కంటే ఎక్కువ మంది ప్రయాణికులు లేదా సరుకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ల్యాండింగ్, టేకాఫ్ సమయంలో సేఫ్టీ నియమాలను పాటించాలి.
ఇవి కూడా చదవండి:
- ఈ దేశం ఎప్పుడు మునిగిపోతుందో చెప్పలేం...
- ఒమిక్రాన్: కరోనా కొత్త వేరియంట్ కేసులు పెరగడంతో ప్రయాణ ఆంక్షలు కఠినతరం చేసిన బైడెన్
- యూపీఏ లాంటిదేమీ లేదని మమతా బెనర్జీ ఎందుకు అన్నారు? ఆమె ఉద్దేశ్యం ఏంటి?
- జవాద్ తుపాను హెచ్చరిక: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- ఆంధ్రప్రదేశ్: పంచాయతీ నిధులను దారి మళ్లించారా, సర్పంచుల ఆందోళన ఎందుకు, ప్రభుత్వ వాదన ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)