‘మోదీ ప్రభుత్వం రిపోర్ట్ కార్డ్’.. సుబ్రమణియన్ స్వామి ట్వీట్ - BBC Newsreel

ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రిపోర్ట్ కార్డ్ అంటూ బీజేపీ నేత రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి ట్విటర్లో గురువారం ఒక పోస్ట్ చేశారు.

ఇదే సందేశంలో ఆయన కేంద్ర ప్రభుత్వం ఐదు వైఫల్యాల గురించి కూడా ప్రస్తావించారు.

"ఆర్థిక వ్యవస్థ-ఫెయిల్, సరిహద్దు భద్రత-ఫెయిల్, విదేశాంగ విధానం-అఫ్గానిస్తాన్‌లో వైఫల్యం, జాతీయ భద్రత-పెగాసస్ ఎన్ఎస్ఓ, అంతర్గత భద్రత, కశ్మీర్ అంధకారం"అని ఆయన ట్వీట్ చేశారు.

వ్యంగ్యంగా "ప్రభుత్వ వైఫల్యాలకు బాధ్యులు ఎవరు?--సుబ్రమణియన్ స్వామి" అని పోస్ట్ చేశారు.

దిల్లీ అసెంబ్లీ కమిటీ ఎదుట హాజరు కావాలని కంగనా రనౌత్‌కు సమన్లు

డిసెంబర్ 6న తమ ఎదుట హాజరు కావాలని బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు దిల్లీ అసెంబ్లీ పీస్ అండ్ హార్మనీ కమిటీ సమన్లు పంపింది.

ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ చడ్డా నేతృత్వంలోని ఈ కమిటీ సిక్కుల గురించి కంగనా రనౌత్ చేసినట్లు చెబుతున్న ఒక ప్రకటన గురించి ఆమెకు సమన్లు పంపింది.

ఇంతకు ముందు దిల్లీ సిక్ గురుద్వారా ప్రబంధ్ కమిటీ అధ్యక్షుడు మన్‌జిందర్ సింగ్ సిర్సా నేతృత్వంలోని ఒక ప్రతినిధి మండలి నవంబర్ 22న పశ్చిమ ముంబయి పోలీస్ అడిషినల్ కమిషనర్ పి.కార్ణిక్‌ను కలిసి కంగనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

రైతులు, సిక్కు సమాజానికి వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన కంగనను అరెస్ట్ చేయాలని ఆయన ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)