You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు... ఇంట్లోంచి బయటకు రావొద్దన్న అధికారులు
తిరుమల, తిరుపతిలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. తిరుమల వీధులతోపాటు తిరుపతిలో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఈ వర్షాల ప్రభావం, సహాయక చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మరోవైపు, టీడీపీ నేతలు కూడా స్పందించారు. తమ పార్టీ కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గోవాలని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు పిలుపునిచ్చారు.
తిరుమలలో భారీ వర్షాలకు అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో కూడా వర్షపు నీరు చేరింది.
నారాయణగిరి అతిథి గృహంలో కొండచరియలు విరిగిపడడంతో మూడు గదులు ధ్వంసమయ్యాయి.
తిరుమల ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగి పడుతుండడంతో అధికారులు రెండు ఘాట్ రోడ్లను మూసేశారు.
కాలి నడక మార్గం 18వ తేది వరకు తెరవబోమని ప్రకటించారు.
తిరుమలలో మొబైల్ నెట్‌వర్క్ సేవలకు కూడా కొంత అంతరాయం కలిగింది.
విపత్తుల నిర్వహణ శాఖ ఆఫీసులోకి కూడా వరద నీరు చేరింది. ఏపీ టూరిజం రెస్టారెంట్ గోడ కూలింది.
తిరుపతిలో వరద తాకిడి తీవ్రంగా ఉంది. వరదరాజ నగర్‌లో భారీ వరద నీటి ప్రవాహంతో వాహనాలు కూడా కొంతదూరం కొట్టుకుపోయాయి. నగర వీధుల్లో పలు చోట్ల మోకాలిలోతు నీళ్లు ప్రవహిస్తున్నాయి.
ప్రసూతి ఆస్పత్రిలోకి కూడా నీళ్ళు చేరాయి. దాంతో అడ్మిషన్స్ నిలిపివేశారు.
టూరిజం గెస్ట్ హౌస్‌లో బిల్డింగ్ కూలడంతో అక్కడ పనిచేసే నారాయణ స్వామి శిథిలా కింద ఇరుక్కుపోయారు. రెస్క్కూ టీం ఆయన్ను రక్షించి తిరుమలలో ఉన్న అశ్విని ఆస్పత్రికి తరలించింది.
తిరుపతిలో భారీగా వర్షపు నీరు, వరద నీరు చేరడంతో ప్రజలు మిద్దెల మీదకు చేరుకుంటున్నారు. దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ప్రజల్ని అధికారులు కోరుతున్నారు.
గడిచిన 50 ఏళ్లలో తిరుపతిలో ఇంతటి వర్షాలను చూడలేదని ప్రజలు అంటున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
పెద్ద ఎత్తున భారీ వర్షాలు, తుఫాన్లు తిరుపతి నగరాన్ని చుట్టుముడుతాయని వాతావరణ శాఖ పదే పదే హెచ్చరికలు చేస్తున్నా, తగిన ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వారం రోజుల కిందట కురిసిన భారీ వర్షాలతో తిరుపతి నగరం అతలాకుతలమైంది. ఈనెల 17 నుంచి 22 తేదీలలో మరింత ఎక్కువగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఇదివరకే హెచ్చరికలు జారీ చేసింది.
ఇక చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే చెరువులు వాగులు వంకలు పూర్తిగా నిండిపోయి పొంగిపొర్లుతున్నాయి. ఎక్కడ ఎప్పుడు ఏ చెరువు కట్టలు తెగుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
దీంతో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పీలేరు, మదనపల్లె ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
వరదప్రాంత ప్రజలకు విజ్ఞప్తి
తిరుపతి అర్బన్ జిల్లాలో రెండు ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఏమైనా అత్యవసరమైతే వారిని సంప్రదించాలని అధికారులు తెలిపారు.
తిరుపతి పరిసరాల ప్రజలు 8309317739 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.
శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల వారు 9885545730 నెంబర్‌కు కాల్ చేయొచ్చు.
ఇవి కూడా చదవండి:
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- జపాన్ దీవుల్లోని కొండకోనల్లో దాగిన ప్రాచీన ఆలయాల విశేషాలు...
- పిడుగులు ఎందుకు పడతాయి? మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి?
- జమ్మూ: క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి, ఇది ఎందుకు అంత ప్రమాదకరం?
- జపాన్: సముద్ర గర్భంలో అంతుచిక్కని ‘ప్రాచీన నగరం’
- ఆల్ఫ్స్ పర్వతాల్లో మంచు వింతగా ఎరుపు రంగులో ఎందుకుంది
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
- ‘మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
- భారీ తిమింగలాలతో పాటు ఎన్నో సముద్ర జీవులను చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- ఉప్పు తిన్న సముద్రానికే మనం ముప్పు తెస్తున్నాం
- సుమత్రా: జీవవైవిధ్యం పరిరక్షణ కోసం ఒక యువతి ఒంటరి పోరాటం
- అనంతపురం విషపు సాలీడు ఎందుకు అంతరించిపోతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)