ఆమిర్ ఖాన్, కిరణ్ రావు: 'విడాకులు తీసుకుంటున్నాం'

బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. విడాకులు తీసుకుంటున్నట్లు వారిద్దరూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

ఇక తమ జీవితాలలో కొత్త అధ్యాయం ప్రారంభించాలనుకుంటున్నామని, ఇకపై భార్యాభర్తలుగా కొనసాగబోమని, తల్లిదండ్రులుగా, కుటుంబ సభ్యులుగా జీవిస్తామని ప్రకటించారు.

''కొద్దికాలం కిందటే విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఇప్పుడు పద్ధతి ప్రకారం విడిపోతున్నాం. మా అబ్బాయి ఆజాద్ పెంపకం బాధ్యతలు ఇద్దరం చూసుకుంటాం. సినిమాలు, పానీ ఫౌండేషన్, ఇతర ప్రాజెక్టుల విషయంలో కలిసి పనిచేస్తాం'' అని వారు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)