ఆక్సిజన్ కొరత: దిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 20 మంది మృతి..

దిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 20 మంది చనిపోయారు.

తమ ఆస్పత్రిలో మొత్తం 200 మంది పేషెంట్లు ఉన్నారని, వారిలో 80 మందికి ఆక్సిజన్‌ అందిస్తున్నామని, 35 మంది ఐసీయూలో ఉన్నట్లు జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ పీటీఐ వార్తా సంస్థతో చెప్పారు.

కేవలం 30 నిమిషాలకు మాత్రమే సరిపోయే ఆక్సిజన్ తమ వద్ద ఉందని మెడికల్ డైరెక్టర్ చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

ఆక్సిజన్ అందక 20 మంది చనిపోయారని అధికారులను ఉటంకిస్తూ పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

ఆక్సిజన్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ చెప్పారు.

అమృత్‌సర్‌లో ఆక్సిజన్ అందక ఆరుగురు మృతి

అటు అమృత్‌సర్‌లోని నీల్‌కాంత్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక మరో ఆరుగురు చనిపోయారు. వారిలో ఐదుగురు కోవిడ్ పేషంట్లు.

ఆక్సిజన్ కొరతతో ఆరుగురు చనిపోయారని ఆస్పత్రి డైరెక్టర్ సునిల్ దేవ్‌గున్ చెప్పారు. ఆక్సిజన్ కొరతగా ఉండటంతో రోగులను ఇతర ఆస్పత్రులకు తీసుకెళ్లాలని వారి బంధువులకు చెప్పినట్లు ఆయన వివరించారు.

ఆస్పత్రికి 50 ఆక్సిజన్ సిలిండర్లు అవసరం ఉండగా.. ప్రస్తుతం తమ వద్ద ఐదు మాత్రమే ఉన్నాయని, మరో 12 మంది కోవిడ్ రోగులు అడ్మిట్ అయ్యారని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)