You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మమతా బెనర్జీ: ‘నందిగ్రామ్‌లో నా విజయంపై బెంగ లేదు.. భయమంతా ప్రజాస్వామ్యం ఏమవుతుందనే’
''ఎలక్షన్ కమిషన్‌కు ఇప్పటికే 63 ఫిర్యాదులు చేశాం. నందిగ్రామ్‌లో నా గెలుపు గురించి నాకు భయమేమీ లేదు.. నా భయమంతా ప్రజాస్వామ్యం గురించే. నందిగ్రామ్‌లో నేను గెలుస్తాను'' అన్నారు మమత.
కేంద్ర హోం మంత్రి స్వయంగా సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ సహా ఇతర బలగాలను బీజేపీకి మాత్రమే సహాయం చేయాలని సూచనలిస్తున్నారని మమత ఆరోపించారు.
ఎలక్షన్ కమిషన్‌ను ఎన్నో ఫిర్యాదులు చేసినా వారు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం బీజేపీ అభ్యర్థుల పక్షం వహరిస్తున్నారని ఆమె అన్నారు.
ఎలక్షన్ కమిషన్ ఎన్ని చేసినా బీజేపీ నందిగ్రామ్‌లో గెలవడం అసాధ్యమని.. 90 శాతం ఓట్లు టీఎంసీకే పడతాయని మమత అన్నారు.
పోలింగ్ శాతం
సాయంత్రం 6 గంటల సరికి పశ్చిమబెంగాల్‌లో 80.43 శాతం పోలింగ్, అస్సాంలో 73.03 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీఐ వెల్లడించింది.
ఉద్రిక్తంగా నందిగ్రామ్
పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ అసెంబ్లీ స్థానంలో ఒక బూత్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ బూత్‌లో బీజేపీ మద్దతుదారులు అక్రమాలకు పాల్పడ్డారని తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు.
దీంతో టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొడంతో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
ఈ ఆరోపణలతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు.
బయాల్‌లోని ఓ బూత్ దగ్గర భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. మరోవైపు రెండు పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
మమతా బెనర్జీ ఈ విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అక్కడ పోలింగ్ నిలిపివేశారు.
ఇలాంటి పాడు ఎన్నికలు ఎన్నడూ చూడలేదు
నందిగ్రామ్‌లోని ఓ పోలింగ్ బూత్‌కు చేరుకున్న మమత అక్కడి నుంచే గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌తో మాట్లాడారు. ఉదయం నుంచి స్థానిక ప్రజలను ఓట్లేయకుండా బీజేపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించారు.
ర్యాలీల్లో మహిళా జర్నలిస్టులతో వెకిలిగా ప్రవర్తిస్తున్నబీజేపీ గూండాలను అదుపులో పెట్టాలని అమిత్ షాకు ఆమె సూచించారు.
గవర్నరు, ఎన్నికల పరిశీలకులతో తాను ఏం చర్చించానో చెప్పబోనని.. ఇలాంటి పాడు ఎన్నికలను ఎన్నడూ చూడలేదని మమత అన్నారు.
ఎలక్షన్ కమిషన్, అమిత్ షాలకు విక్టరీ సింబల్ చూపిస్తున్నానని ఆమె అన్నారు.
మమత ఓటర్లను అవమానిస్తున్నారు: సువేందు అధికారి
కాగా మమత తీరును నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి, ఆమె ఎన్నికల ప్రత్యర్థి సువేందు అధికారి ఖండించారు.
మమత ఓటర్లను అవమానిస్తున్నారని.. నందిగ్రామ్ ప్రజలను అవమానించడం ఆమెకు అలవాటేనని అన్నారు.
ప్రమాదంలో గాయపడి ఇతరులపై ఆరోపణలు చేశారని అన్నారు.
ఎన్నికలను ఈసీ నిర్వహిస్తుంది కానీ గవర్నరు కాదని.. గవర్నరు రాజ్యాంగబద్ధమైన పదవిలోని వ్యక్తి కాబట్టి ఆయనతో ఆమె మాట్లాడొచ్చని.. అందులో ఏమీ సమస్య లేదని సువేందు అన్నారు.
రెండో దశలో
పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది.
బెంగాల్‌లో రెండో దశలో 30 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
వీటిలో మెదినీపుర్ జిల్లాలోని నందీగ్రామ్ కూడా ఉంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నందీగ్రామ్ నుంచే పోటీ చేస్తున్నారు.
దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ నియోజకవర్గంపైనే ఉంది.
మమతకు ఒకప్పుడు సన్నిహితుడైన శుభేంధు అధికారి బీజేపీ అభ్యర్థిగా పోటీపడుతున్నారు.
సీపీఎం అభ్యర్థి మీనాక్షీ ముఖర్జీ కూడా ఈ స్థానం నుంచి బరిలో ఉన్నారు.
నందీగ్రామ్ నియోజకవర్గాన్ని సున్నితమైందిగా భావిస్తూ బుధవారం నుంచి ఎన్నికల కమిషన్ ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తోంది.
మరోవైపు అసోంలో రెండో దశలో 39 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
బెంగాలీలు ఎక్కువగా ఉండే బరాక్ లోయ ప్రాంత పరిధిలోని 15 సీట్లు కూడా వీటిలో ఉన్నాయి.
అస్సామీలు ఎక్కువగా ఉండే బ్రహ్మపుత్ర లోయ ప్రాంతంలో పౌరసత్వ సవరణ చట్టంపై వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే.
బరాక్ ప్రాంతంలోని హిందు బెంగాలీలు మాత్రం ఈ చట్టాన్ని సమర్థిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- దావూద్ ఇబ్రహీం వెంట బాలీవుడ్ ఎందుకు పరుగులు పెడుతోంది
- ‘గర్భం దాల్చేందుకు మా ఊరికొస్తారు’
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- కండోమ్స్, టైర్లు సహా ఎన్నో వస్తువుల తయారీలో వాడే విలువైన పదార్థం కనుమరుగైపోనుందా
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి ఇలా తొలగించండి
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)