తెలంగాణ: ఈ పులి మనిషి రక్తం రుచి మరిగిందా? దీనిని అధికారులే అడవిలోకి వదిలారా?

వీడియో క్యాప్షన్, తెలంగాణ: ఆ పులి మనిషి రక్తం రుచి మరిగిందా? దానిని అధికారులే అడవిలోకి వదిలారా?

తెలంగాణలో ఆసిఫాబాద్ ప్రాంతంలోని కదంబ అడవుల్లో సంచరిస్తున్న ఒక పులి- గిరిజనులు, అటవీ శాఖ అధికారులు, రాజకీయ నాయకుల మధ్య చిచ్చు పెట్టింది. పులి, పోడు, పత్తి- ఈ మూడు పదాలు అక్కడ అలజడి రేపుతున్నాయి. కాగజ్ నగర్ దగ్గర్లోని దిగడ, కొండపల్లి గ్రామాల్లో ఇద్దరు పులి వల్ల చనిపోయారు. దీంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. పులిని అటవీ అధికారులే అడవిలోకి వదిలారని గిరిజనులు ఆరోపిస్తున్నారు. అది సాధ్యం కాదని అటవీ అధికారులు అంటున్నారు. అక్కడ అసలేం జరుగుతోంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)