రఖ్మాబాయి రౌత్: బలవంతపు పెళ్లిళ్లపై జైలుకు వెళ్లేందుకు సిద్ధపడిన ధీరవనిత

ఆధునిక భారత్‌లో తొలి మహిళా డాక్టర్ అనగానే రఖ్మాబాయి రౌత్ పేరు గుర్తుకు వస్తుంది. అయితే, ఓ స్త్రీవాదిగా ఆమె ఎక్కువ మందికి సుపరిచితం. 22ఏళ్ల వయసులోనే తన విడాకుల కోసం ఆమె కోర్టులో పోరాడారు.

అప్పట్లో భార్యలను విడిచిపెట్టడం లేదా విడాకులు ఇవ్వడం సర్వసాధారణం.

అయితే, భర్త నుంచి విడాకులు కావాలని కోరిన తొలి మహిళ రఖ్మాబాయి కావొచ్చు.

ఆమె విడాకుల కేసు అప్పటి సంప్రదాయ సమాజంలో ప్రకంపనలే సృష్టించింది.

ఆధునిక భారతదేశంలో మార్పుకు ప్రతినిధులుగా ఉన్న, చరిత్ర పుటల్లో స్థానం దక్కని పది మంది మహిళల స్ఫూర్తిదాయక కథలను బీబీసీ అందిస్తోంది. వీళ్లంతా మీరు తెలుసుకోవాల్సిన భారతీయ చారిత్రక మహిళలు.

ఈ సిరీస్‌లోని ఇతర కథనాలు:

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)