సంతోష్ బాబు: 'ఏం భ‌య‌ప‌డొద్దమ్మా అని చెప్పాడు. మరుసటి రోజే ఈ వార్త వినాల్సి వ‌చ్చింది'

వీడియో క్యాప్షన్, 'ఒక్క‌రే కొడుకు. ఏం భ‌య‌ప‌డొద్దమ్మా అని చెప్పాడు. మేము ఈ వార్త వినాల్సి వ‌చ్చింది'

భారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో భారత్ - చైనా సైనిక బలగాల మధ్య ఘర్షణలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మరణించారు.

ఆయన పదిహేనేళ్లుగా సైన్యంలో పనిచేస్తున్నారు. ఏడాదిన్నరగా చైనా సరిహద్దులో పనిచేస్తున్నారు. 16-బిహార్ రెజిమెంట్‌కు చెందిన ఆయన మృతి చెందినట్లు కుటుంబీకులకు సైనికాధికారులు సమాచారం అందించారు.

సంతోష్‌కు భార్య సంతోషి, కుమారుడు అభిజ్ఞ(9), అనిల్(4) ఉన్నారు.

దిల్లీలో ఉంటున్న సంతోష్ భార్యకు భారత సైన్యం నుంచి సమాచారం అందగా తమకు సోమవారం మధ్యాహ్నం తెలిపిందని సంతోష్ తల్లి మంజుల చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)