ఆంఫన్ తుఫాను: బెంగాల్ - బంగ్లాదేశ్ మధ్య తీరం దాటిన సూపర్ సైక్లోన్
బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆంఫన్ తుఫాను పశ్చిమబెంగాల్‌లోని సుందర్బన్ సమీపంలో తీరం దాటింది.
తుఫాను బుధవారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5.30 గంటల మధ్య.. పశ్చిమ బెంగాల్‌లోని దిఘా - బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్య తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ వివరించింది.
తీరం దాటే సమయంలో గంటకు 185 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని చెప్పింది.
1999 తర్వాత బంగాళాఖాతంలో ఏర్పడిన తొలి సూపర్ సైక్లోన్ ఇదేనని నిపుణులు చెబుతున్నారు.
కోవిడ్-19 కారణంగా లాక్‌డౌన్, భౌతిక దూరం నిబంధనలు అమల్లో ఉండటంతో ప్రభావిత ప్రాంతాల నుంచి జనాలను తరలించడంలో అధికారులకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
భారత్‌లో, బంగ్లాదేశ్‌లో పాఠశాలలు, ఇతర భవనాలను తాత్కాలిక శిబిరాలుగా మార్చుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- సూపర్ సైక్లోన్ ఆంఫన్: ప్రపంచంలో అత్యంత ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?
- కరోనావైరస్కు తుపాను కూడా తోడైతే సామాజిక దూరం పాటించడం ఎలా?
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- తిత్లీ తుపాను: ‘శ్రీకాకుళం జిల్లాను 20 ఏళ్లు వెనక్కి నెట్టింది’
- ఫొని తుపాను: ఒడిశాలో ఇంకా పునరావాస కేంద్రాల్లోనే దళితులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)