You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అసదుద్దీన్ ఒవైసీ: 'ఇద్దరు పిల్లల విధానం' అసలు సమస్యలను పక్కదోవ పట్టించడానికే
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చెబుతున్న 'ఇద్దరు పిల్లల విధానం'పై ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. "దేశంలోని అసలు సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలే ఇవన్నీ" అని ఈ హైదరాబాద్ ఎంపీ వ్యాఖ్యానించారు.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఒవైసీ, "నాకు ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. బీజేపీ నాయకులలో చాలా మందికి ఇద్దరికి మించి పిల్లలున్నారు. ఆర్ఎస్ఎస్ మొదటి నుంచీ ముస్లింల జనాభా నియంత్రించాలని చెబుతూ వస్తోంది. ఇప్పుడు మోహన్ భగవతి ఇద్దరు పిల్లల విధానం గురించి మాట్లాడుతున్నారు. కానీ, ఈ ప్రభుత్వం ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది. ఉపాధి అవకాశాల్లేక 2018లో రోజుకు సగటున 36 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీని గురించి మీరేమంటారు? ఇది మీరు సిగ్గుపడాల్సిన విషయం" అని అన్నారు.
"దేశ జనాభాలో 60 శాతం మంది 40 ఏళ్ళ లోపువారే ఉన్నారని, కానీ, గత అయిదేళ్ళలో మీరు ఎవరికీ ఉద్యోగావకాశాలు కల్పించలేదు. ఆ విషయాలేవీ మీరు మాట్లాడరు. ఇది మీరు సిగ్గు పడాల్సిన విషయం" అని ఒవైసీ విమర్శించారు.
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ ఉత్తరప్రదేశ్‌లో ఏర్పాటైన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, "దేశంలో ఇద్దరు పిల్లల చట్టాన్ని తీసుకురావాలన్నదే మా తదుపరి ప్రతిపాదన" అని అన్నారు. ప్రస్తుతానికి ఇది సంఘ్ ఆలోచనే అని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అసలు పుతిన్ ఎవరు.. ఆయన ఏం కోరుకుంటున్నారు?
- RSS 'ఇద్దరు పిల్లల ప్లాన్' వల్ల భారత్కు కలిగే లాభమేంటి.. జరిగే నష్టమేంటి
- రూపాయి చరిత్ర : కరెన్సీ నోట్ల మీదకు గాంధీ బొమ్మ ఎప్పుడు వచ్చింది...
- కీటకాలు అంతరిస్తున్నాయి.. అవి లేకపోతే మనిషి కూడా బతకలేడు
- ఆనందం ఏ వయసులో తగ్గిపోతుంది... సైన్స్ ఏం చెబుతోంది?
- జాలర్లకు సముద్రంలో రహస్య నిఘా పరికరాలు దొరుకుతున్నాయి.. ఎందుకు
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: కంగారూల ద్వీపాన్ని కమ్మేసిన మంటలు
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- మహిళల జీవితాలను మార్చేసిన కుట్టు మిషన్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)