#BBCISWOTY: ఓ రోజు కూలీ బిడ్డ.. ఇప్పుడు భారత హాకీ ఛాంపియన్
నేహా గోయల్.. భారత మహిళా హాకీ జట్టు మిడ్ ఫీల్డర్. టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆశా కిరణాల్లో ఆమె కూడా ఒకరు. కానీ, నేహా ఆ స్థాయికి చేరుకునేందుకు జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు.
తండ్రి చనిపోవడంతో, నేహా తల్లి ఒకప్పుడు గంటకు 4 రూపాయల కూలీకి పనిచేస్తూ పిల్లల్ని పెద్ద చేసింది. ఆ కుటుంబ కష్టాలను దూరం చేయడంతో పాటు భారత్‌కు పతకాల పంట పండించే బాధ్యతనూ నేహా భుజాన వేసుకుంది.
ఆమె రైల్వే జట్టులో చేరినప్పటి నుంచి జాతీయ స్థాయి సీనియర్ మహిళల హాకీ పోటీల్లో ఆ జట్టు వరుసగా ఐదేళ్లుగా బంగారు పతకం గెలుస్తూనే ఉంది. స్ఫూర్తిదాయకమైన నేహా ప్రయాణాన్ని మీరూ చూడండి.
#BBCISWOTY - BBC Indian Sports Woman of the Year సిరీస్‌లో భాగంగా అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- షాహీన్ బాగ్: 'మగవాళ్ల తోడు లేనిదే బయటకు రాలేని మహిళలు.. CAA నిరసనల ముఖచిత్రంగా మారారు'
- సముద్రజీవులను, భారీ తిమింగలాలను సైతం చంపేస్తున్న ‘ఘోస్ట్ గేర్’
- గాలి నుంచి ఆహారం తయారు చేస్తున్న ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు.. ఇదెలా సాధ్యం?
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- మద్యం తాగేవాళ్లు తమ భార్యలు, గర్ల్ఫ్రెండ్స్ను హింసించే అవకాశం ‘ఆరు రెట్లు ఎక్కువ’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
