You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాహుల్ గాంధీ: నా పేరు రాహుల్ సావర్కర్ కాదు, నేను క్షమాపణ కోరను
దిల్లీలో ప్రభుత్వ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పిలుపునిచ్చిన ఒక ర్యాలీలో తన 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలను ప్రస్తావించిన ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ తన మాటలకు క్షమాపణ అడగనని చెప్పారు.
రాంలీలా మైదాన్‌లో ఆయన మాట్లాడుతూ "నా పేరు రాహుల్ సావర్కర్ కాదు. నా పేరు రాహుల్ గాంధీ. నేను నిజం కోసం క్షమాపణ అడగను. ప్రాణాలైనా వదులుతా, కానీ క్షమించమని అడగను" అన్నారు.
"ప్రధానమంత్రి, ఆయన అసిస్టెంట్ అమిత్ షా.. ఇద్దరూ క్షమాపణ అడగాలి. మొదట్లో మన ఆర్థికవ్యవస్థ బలంగా ఉండేది. మొదట 9 శాతం జీడీపీ వృద్ది రేటు ఉండేది. ఇప్పుడు ఉల్లిపాయలు పట్టుకుని ఉన్నారు" అన్నారు.
కాంగ్రెస్ 'భారత్ బచావో (భారత్‌ను కాపాడండి)' ర్యాలీలో రాహుల్ గాంధీ దేశ ఆర్థికవ్యవస్థ గురించి మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
"భారత ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోదీ ఒక్కరివల్లే నాశనమైంది. నల్లధనాన్ని అంతం చేస్తానంటూ, మీకు అబద్ధాలు చెప్పి నోట్లరద్దు చేశారు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ ట్యాక్స్ (జీఎస్‌టీ) వేశారు" అన్నారు.
పారిశ్రామికవేత్తల బలంతో ప్రధానమంత్రి మీడియాలో వెలిగిపోతుంటారని కూడా రాహుల్ గాందీ అన్నారు.
"టీవీలో ఏదైనా ఒక 30 సెకన్ల ప్రకటన రావాలంటే, దానికి లక్షలు ఖర్చవుతుంది. నరేంద్ర మోదీ టీవీపై రోజంతా కనిపిస్తారు. దానికి డబ్బు ఎవరిస్తున్నారు? నరేంద్ర మోదీ మీ డబ్బును లాక్కుని ఎవరికి ఇస్తున్నారో, వాళ్లే దానికి డబ్బు ఇస్తున్నారు" అన్నారు.
'రేప్ ఇండియా'పై వివాదం
శుక్రవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన 'రేప్ ఇన్ ఇండియా' వ్యాఖ్యలు పార్లమెంటు నుంచి సోషల్ మీడియా వరకూ చర్చనీయాంశం అయ్యాయి.
రాహుల్ గాంధీ ఝార్ఖండ్ ఎన్నికల ర్యాలీలో... "నరేంద్ర మోదీ 'మేక్ ఇన్ ఇండియా' అన్నారు. మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కాదు... 'రేప్ ఇన్ ఇండియా' ఉంది" అన్నారు.
రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా చాలా మంది బీజేపీ ఎంపీలు పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించారు.
స్మృతి ఇరానీ లోక్‌సభలో... "గాంధీ కుటుంబంలోని ఒక కొడుకు 'రండి, భారత్‌లో రేప్ చేయండి' అని చెప్పడం మొదటిసారి జరిగింది. రాహుల్ గాంధీ ఈ సభలో ఒక నేత. అంటే భారత్‌లో ప్రతి వ్యక్తీ రేప్ చేయాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పాలనుకుంటున్నారా" అన్నారు.
ఆ తర్వాత రాహుల్ గాంధీ ట్విటర్‌లో వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీ ఉన్న ఒక పాత వీడియోను కూడా షేర్ చేశారు. అందులో మోదీ దిల్లీని 'అత్యాచార రాజధాని' అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- మోదీ నీడ నుంచి బయటపడి అమిత్ షా తనదైన ఇమేజ్ సృష్టించుకున్నారా?
- బాలికపై అత్యాచారం: డబ్బు కోసం కూతురిని రెండేళ్ళుగా రేప్ చేయించిన తండ్రి
- 'గోల్డెన్ పాస్‌పోర్టుల' కోసం సంపన్నులంతా ఎందుకు ఎగబడుతున్నారు?
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన బారత్
- విమానంలో ప్రయాణికురాలిని తేలు కుట్టింది
- ఏపీలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి తెలంగాణలో రేప్ నిందితుల వరకు.. ఎన్కౌంటర్లలో నిజమెంత
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
- బిల్లా, రంగా ఎవరు.. వాళ్లను ఉరి తీయాలని దేశమంతా ఎందుకు కోరుకుంది...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)