జిడ్డు కృష్ణమూర్తితో అరుదైన ఇంటర్వ్యూ: ‘‘నీలో జ్యోతిని నువ్వే వెలిగించుకోవాలి’’

వీడియో క్యాప్షన్, జిడ్డు కృష్ణమూర్తి

మానవ సంబంధాలు, మానసిక తిరుగుబాటు, సమాజంలో రావాల్సిన మార్పుల గురించి ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చేసిన ప్రసంగాలు, రచనలు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ప్రభావితం చేశాయి.

చిత్తూరులోని మదనపల్లెలో పుట్టిన జిడ్డు కృష్ణమూర్తి మద్రాసులో అడయార్ ప్రాంతంలో ఉన్న థియోసాఫికల్ సొసైటీలోనే ఉండేవారు. ఆధ్యాత్మిక చింతనలో, తనదైన తాత్వికతను ప్రతిపాదించడంలో కొత్త శిఖరాలను అధిరోహించినట్లుగా ప్రపంచం గుర్తించిన కృష్ణమూర్తి 1895 మే 11న జన్మించారు. 1986లో తుదిశ్వాస విడిచారు.

అంతకుముందు ఐదేళ్ల కిందట 1981లో బీబీసీ జర్నలిస్టు బెర్నార్డ్ లెవిన్‌ ఆయన్ను ఇంటర్వ్యూ చేశారు.

జిడ్డు కృష్ణమూర్తికి మాత్రమే తెలిసిన 'రహస్యాల'ను ఆయన బయటకు తీసే ప్రయత్నం చేశారు.

జిడ్డు కృష్ణమూర్తి సమాధానాలు ఎలా ఉన్నాయో.. ఆయన తాత్వికత ఎలాంటితో తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)