వీడియో: ఆంధ్రాలో లిప్‌స్టిక్ గింజల సాగు

వీడియో క్యాప్షన్, ఆంధ్రాలో లిప్‌స్టిక్ కాయల సాగు

రిపోర్టర్: విజయ్ గజం

షూట్, ఎడిట్: నవీన్ కుమార్ కె

ప్రొడ్యూసర్: సంగీతం ప్రభాకర్

డ్రోన్ విజువల్స్: అజయ్

లిప్‌స్టిక్ రంగుల్లో మెరిసే పెదాలను, ఆ రంగు పెదాల నుంచి జాలువారే నవ్వులను చూసేవుంటారు.. కానీ ఆ పెదాలకు రంగులద్దిన లిప్‌స్టిక్‌లను వేటితో తయారు చేస్తారు? వాటిని ఎక్కడ పండిస్తారు?

ఎంతోదూరం కాదు.. తూర్పుగోదావరి జిల్లాలో ఓ యువరైతు.. ఆ ప్రాంతంలో కొత్త వ్యవసాయానికి తెరలేపారు. లిప్‌స్టిక్ తయారీకి అవసరమయ్యే గింజలను పండిస్తున్నారు.

ప్రకృతి సహాజంగా ఇచ్చే రంగులతో అనేక పూలు పూస్తుంటాయి. ఆ కోవకే చెందుతుంది అనాటో మొక్క. సింధూరీ, జాఫ్రా అని పిలిచే ఈ మొక్క కాయలు, గింజల నుంచి వచ్చే రంగును లిప్‌స్టిక్ తయారీలో ఉపయోగిస్తారు.

ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కిషోర్ అనే యువకుడు ఈ మొక్కలను సాగు చేస్తున్నారు. ఈ వ్యవసాయం గురించి, మార్కెటింగ్ గురించి బీబీసీ కిషోర్‌ను పలకరించింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)