You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘‘దక్షిణ భారతదేశంలో భారీ ఉగ్రదాడులు’’ అంటూ కర్నాటక పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చిన డ్రైవర్ అరెస్ట్
దక్షిణ భారతదేశంలో భారీ ఎత్తున ఉగ్రవాద దాడులు జరుగనున్నాయి అంటూ తప్పుడు సమాచారం ఇచ్చిన ఒక లారీ డ్రైవర్‌ను బెంగళూరు గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేశారని ఒక పోలీసు అధికారి తెలిపారు.
శుక్రవారం సాయంత్రం బెంగళూరు సిటీ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది.
ఫోన్ చేసిన వ్యక్తి.. తనపేరు స్వామి సుందర్ మూర్తి అని, తానొక డ్రైవర్‌నని.. తమిళనాడులోని రామనాథపురంలో 19 మంది ఉగ్రవాదులు ఉన్నారని, తమిళనాడు, కర్నాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, గోవా, మహారాష్ట్రల్లోని ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున ఉగ్రదాడులు జరుగనున్నాయని చెప్పారు.
ఈ ఉగ్రవాద దాడులు రైళ్లలో జరుగనున్నాయని కూడా ఆయన చెప్పారు.
తాను బెంగళూరుకు సమీపంలోని హోసూరు వైపు వెళుతున్నానంటూ తమిళం, వచ్చీరాని హిందీ భాషల్లో మాట్లాడారు.
దీంతో, కర్నాటక డీజీపీ నీలమణి ఎన్ రాజు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, గోవా, మహారాష్ట్ర డీజీపీలు, బెంగళూరు నగర పోలీసు కమిషనర్, కేంద్ర హోం శాఖ, రైల్వే శాఖలను అప్రమత్తం చేస్తూ ఒక సందేశాన్ని పంపించినట్లు చూపుతున్న లేఖ ఒకటి బయటికొచ్చింది. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐ సైతం ఈ లేఖను ఉటంకిస్తూ ఒక వార్తను రాసింది.
గత వారం శ్రీలంకలో పేలుళ్లు జరిగిన నేపథ్యంలో కర్నాటక రైల్వే స్టేషన్లు, రైళ్లలో పెద్ద ఎత్తున సోదాలు జరిగాయి.
అయితే, ఇదంతా తప్పుడు సమాచారం అని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు.
65 ఏళ్ల లారీ డ్రైవర్ మాజీ సైనికుడని వారు చెప్పారు.
‘‘అవలహళ్లి ప్రాంతంలో మేం అతడిని అదుపులోకి తీసుకున్నాం. తదుపరి విచారణ కోసం బెంగళూరు నగర పోలీసులకు అప్పగించాం’’ అని బెంగళూరు రూరల్ పోలీసు విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భారత్‌లో పాకిస్తాన్ నుంచి వచ్చిన హిందువుల పరిస్థితి ఎలా ఉంది?
- శ్రీలంక పేలుళ్ల ‘సూత్రధారిగా భావిస్తున్న హషీమ్’ చెల్లెలు ఏమంటున్నారంటే...
- కియా మోటార్స్: 'స్థానికులకు ఉద్యోగాలంటే... స్వీపర్లు, సెక్యూరిటీ గార్డులేనా'
- చెర్నోబిల్: భారీ అణు విషాదానికి నేటితో 33 ఏళ్లు.. అసలు ప్రమాదం ఎలా జరిగింది?
- ‘27 ఏళ్ల తరువాత కోమా నుంచి బయటపడిన అమ్మ నన్ను పేరు పెట్టి పిలిచింది’
- లవ్ ఎట్ ఫస్ట్ సైట్: తొలిచూపు ప్రేమలో అంత బలం ఉంటుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)