You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్‌లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలపై హైకోర్టు స్టే
ఆంధ్రప్రదేశ్‌లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 3వరకు స్టే విధించింది. ఏప్రిల్ 3న సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు తెలిపింది.
కానీ తెలంగాణలో ఈ సినిమా ప్రదర్శనకు న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
ఈ సినిమాను విడుదల చేయొద్దంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇద్దరు వ్యక్తులు వేసిన రిట్ పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. వాదనల అనంతరం, ఈ కేసును ఏప్రిల్ 3కు వాయిదా వేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.
సినిమా కాపీని తమ ఛాంబర్‌కు తీసుకువస్తే, ఇరుపక్షాల న్యాయవాదుల సమక్షంలో సినిమా చూస్తామని, ఆ తర్వాతే విడుదల గురించి నిర్ణయం తీసుకుంటామని న్యాయమూర్తి తెలిపారు.
సెన్సార్ బోర్డు అనుమతిచ్చాక, సినిమా విడుదలకు అడ్డుచెప్పడానికి వీల్లేదని నిర్మాత తరపు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.
'పద్మావత్' సినిమా విడుదలపై సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావించిన సుధాకర్ రెడ్డి, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలకు తెలంగాణ హైకోర్టు అనుమతించిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు.
అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ, సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సినిమా నిర్మాత ఆలోచిస్తున్నారంటూ స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ సినిమా విడుదలపై మంగళగిరి కోర్టు కూడా స్టే విధించింది. ఏప్రిల్ 15 వరకు మంగళగిరి పట్టణంలో ఈ సినిమాను విడుదల చేయొద్దంటూ ఇంజక్షన్ ఆర్డర్ జారీ చేసింది.
ఈ సినిమా తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉంటుందని భార్గవపేటకు చెందిన పాటిబండ్ల అనిల్ అనే వ్యక్తి మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో, ఏప్రిల్ 15 వరకు సోషల్ మీడియా వేదికల్లో కూడా సినిమాను విడుదల చేయకూడదంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ, అగస్త్య మంజులతోపాటు నిర్మాత రాకేష్ రెడ్డికి కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి
- వీడియో జర్నలిస్టుపై బాలకృష్ణ దాడి వీడియో... బాధితుడు ఏమన్నారంటే...
- నరేంద్ర మోదీ ప్రభావం దక్షిణ భారతంలో ఎందుకు లేదు...
- నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్ని హామీలను అమలు చేసింది- BBC Special
- ఆ ఒక్క మాట... ఆనాడు నీలం సంజీవ రెడ్డిని రాష్ట్రపతి కాకుండా చేసింది
- మొదటి ఎన్నికల్లో జవహర్లాల్ నెహ్రూను మించిన మెజార్టీ సాధించిన తెలుగు ఎంపీ
- మిషన్ శక్తి: భారతదేశ పరీక్షల అనంతరం.. అంతరిక్షంలో పెరుగుతున్న చెత్తపై ఆమెరికా హెచ్చరికలు
- వైఎస్ వివేకానందరెడ్డి హత్య: పీఏ క్రిష్ణా రెడ్డి సహా ముగ్గురి అరెస్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)