తెలంగాణ ఎన్నికలు: 'మా ఊరికి రావద్దు... మేం ఎవరికీ వోటు వెయ్యం'
‘‘నా కొడుకుకు కరెంటు షాక్ తగిలింది. తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోవడం వల్ల చనిపోయాడు" అంటూ తన రెండేళ్ల మనవడికి తినిపిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది లంకా బాయి.
‘‘ఆ రోజు వాన పడుతోంది. నేలంతా తడిసింది. నా కొడుకు పశువులను మేపుతూ.. ట్రాన్స్‌ఫార్మర్ దగ్గరకు వెళ్లగానే షాక్ కొట్టింది. నా బిడ్డను బతికించుకునేందుకు శానా కష్టపడ్డాం. కానీ, ఆ వాగును దాటలేకపోయాం. దాంతో మార్గం మధ్యలోనే నా కొడుకు చనిపోయాడు"
ఇవీ ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల కథలు!
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీబీసీ ప్రతినిధి దీప్తి బత్తిని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం, ఇతర సౌకర్యాల లేమితో జీవితాన్ని నెట్టుకొస్తున్న ప్రజలతో మాట్లాడారు.
తాము ఇన్ని సమస్యలతో సతమతం అవుతున్నా, నేతలు మాత్రం తమను నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకోసం ఈ ఎన్నికల్లో తాము ఏ నేతకూ ఓటు వేయం అని గ్రామస్థులు ప్రతిన పూనారు.
ఆ వివరాలను పై వీడియోలో చూడండి.
ఇవి కూడా చదవండి:
- బౌడికా: రోమన్లను తరిమికొట్టిన తొలి మహారాణి, ఆమె నేర్పే ఆరు జీవిత పాఠాలు
- సర్దార్ వల్లభాయ్ పటేల్: నర్మదా నదీ తీరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహం
- ఇందిరాగాంధీ: మెదక్ అంటే ఎందుకంత అభిమానం?
- శ్రీలంక విషయంలో భారత్-చైనా ఒక్కటవ్వాలా?
- ఒక్క కోడిని కూడా చంపకుండా చికెన్ తినడం ఎలా?
- హైదరాబాద్లో శాకాహారులు ఎంత మంది? మాంసాహారులు ఎంత మంది?
- నకిలీ చంద్రుడు: చైనా ఎందుకు తయారు చేస్తోందంటే..
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.