సియోరా లియోన్: అక్కడ అప్పుడే పుట్టిన పిల్లలు కూడా ఖైదీలే

వీడియో క్యాప్షన్, సియోరా లియోన్ లో న్యాయవ్యవస్థ కుప్పకూలిపోబోతోందా ?

( వీడియోలోని కొన్ని దృశ్యాలు మీ మనసుల్ని కలచివేయొచ్చు)

సియెరా లియోన్‌లో న్యాయ వ్యవస్థ కుప్పకూలిపోయే విధంగా ఉందని.. కార్యకర్తలు వాపోతున్నారు. 2002లో అక్కడ అంతర్యుద్ధం ముగిసింది.

దాంతో ఆ దేశం జాతీయ స్థాయిలో న్యాయస్థానాల ఏర్పాటు చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

జైళ్లలో పరిమితికి మించి ఖైదీలు నిండిపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి.

ఖైదీలకు పుట్టిన పిల్లలు కూడా జైళ్లలోనే ఖైదీల్లాగే రోజులు గడపాల్సిన దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.

ఇటీవల విస్మయానికి గురిచేసే కొన్ని చిత్రాలు బయటకొచ్చాయి. అవి ఒక జైలులో రహస్యంగా చిత్రించిన ఫోటోలు. వాటిని చూశాక ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. బీబీసీ బృందానికి బో కారాగారంలోనికి వెళ్లే అనుమతి లభించింది.

మా ఇతర కథనాలను చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)