భ్యాగరి మహిళలు: 'మా బతుకంతా శవాల మధ్యనే'

వీడియో క్యాప్షన్, మా బతుకంతా శవాల మధ్యనే: బ్యాగరి మహిళలు

మెదక్‌ పాత బస్టాండ్‌ నుండి కిలోమీటరు దూరంలో గిద్దకట్ట సమీపంలో గుట్టల మధ్య ఉన్న చిక్కటి అడవిలాంటి స్మశాన వాటికలోకి మేం అడుగు పెట్టగానే నలుగురు మహిళలు బొంద తవ్వుతూ కనిపించారు.

చనిపోయిన వారి అంత్యక్రియలు జరపడమే వీరి జీవనోపాధి. ఇది బ్యాగరి మహిళలకు తరతరాలుగా వచ్చిన కుల ఆచారం.

‘‘ఆస్పత్రుల దగ్గర అనాథ శవాలను తీయాలన్నా మేమే పోవాలి. కుళ్లిన శవాల దగ్గరకు మమ్మల్నేపిలుస్తారు. మా బతుకంతా శవాల మధ్యనే. భరోసా లేని బతుకులు మావి’’ అని గోతిని తవ్వడం ఆపకుండానే చెప్పింది బ్యాగరి లచ్చిమి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)