తెలంగాణ: చెంచుల కట్టు బానిసత్వం ముగిసినట్టేనా?
తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వెనుకబాటుతనంతో జీవనం సాగిస్తున్న ఆదివాసీ తెగల్లో చెంచులు ఒకరు. దాదాపు అర్ధ శతాబ్దం కిందట శ్రీశైలం రిజర్వాయర్ నిర్మాణం ఫలితంగా నిర్వాసితులైన చెంచులు ఆ తర్వాత వెట్టిచాకిరీ బంధనాల్లో చిక్కుకుపోయారు.
పులుల అభయారణ్యం కారణంగా విధిస్తున్న ఆంక్షలు వారి జీవితాల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. బతుకుతెరువు కోల్పోయిన వీరిని వడ్డీ వ్యాపారులు, దళారులు దోచుకోవడం మొదలుపెట్టారు. ఏళ్ల క్రితం తీసుకున్న చిన్నపాటి అప్పులకు నేటికీ వడ్డీలు చెల్లించలేక కట్టుబానిసలుగా మారుతున్నారు.
ఇటీవల కొన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు చేసిన కృషి వల్ల వారు వెట్టిచాకిరీ నుంచి విముక్తులయ్యారు. వెట్టిని రద్దు చేస్తూ, వడ్డీ వ్యాపారులకు ఇకపై డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని మేజిస్ట్రేట్ ధ్రువీకరించిన పత్రాలను వారికి అందించారు. అయినా పరిస్థితిలో పూర్తిగా మార్పు లేదు.
మరో ఇబ్బంది ఏంటంటే... వీరు పట్టిన చేపలను బయట మార్కెట్లో అమ్ముకోవడాన్ని దళారులు అడ్డుకుంటున్నారు.
అయితే చెంచుల బతుకు బండిని పట్టాల మీదకు తేవాలంటే వీరు ఇంకా ఎన్నో అడ్డంకులు దాటాల్సి ఉంది. చెంచుల ప్రస్తుత స్థితిగతులపై బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావి అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- మీ ఫోన్లో మీకు తెలీకుండానే ఆధార్ ఫోన్ నంబర్ సేవ్ అయి ఉందా... ఒక్కసారి చూసుకోండి
- ఓషో వల్లనే రాజీవ్ రాజకీయాల్లోకి వచ్చారా?
- BBC SPECIAL: చైనాలో బాహుబలి, దంగల్ సినిమాలు ఎందుకంత హిట్టయ్యాయంటే...
- పశ్చిమ బెంగాల్ మతఘర్షణలకు ఆ పాటలే కారణమా?
- వైరల్: ఏనుగులను తగలబెట్టేశారు
- ’నా భర్త నా కిడ్నీ దొంగిలించాడు’
- బీజేపీకి ఇది స్వర్ణయుగమా?
- కోల్కతా: రెడ్లైట్ ఏరియాలో ఈ రంగుల హరివిల్లులెందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)