#గమ్యం: బ్యాంకు ఉద్యోగం సాధించడం ఎలా?

వీడియో క్యాప్షన్, #గమ్యం: బ్యాంకు ఉద్యోగం సాధించడం ఎలా?

బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.

ఎన్ని రకాల ఉద్యోగాలున్నా బ్యాంకు, రైల్వే ఉద్యోగాలకు ఎప్పుడూ క్రేజ్ తగ్గదు. ఉద్యోగ భద్రత కావచ్చు, మంచి జీతభత్యాలు కావచ్చు, మంచి భవిష్యత్ కావచ్చు... ఇలా కారణాలు ఏవైనా ఇతర ఉద్యోగాల కన్నా వీటిపై యువతకు మోజు ఎక్కువగానే ఉంటుంది. అందుకే వందల సంఖ్యలో ఖాళీలు అని ప్రకటన వెలువడినా లక్షల్లో అప్లికేషన్లు వస్తాయి. రైల్వే ఉద్యోగాలతో పోలిస్తే బ్యాంకు ఉద్యోగాలకు డిమాండ్ మరింత ఎక్కువ. అయితే, అసలు బ్యాంకింగ్ రంగంలో ఏయే ఉద్యోగాలున్నాయి, వాటికి ఏ పరీక్షలు రాయాలి, ఎవరు ఈ పరీక్షలు నిర్వహిస్తారు, ఎలా సిద్ధం కావాలి, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది... ఈ వివరాలన్నీ ఈ వారం 'గమ్యం'లో వివరిస్తున్నారు Careers360.com డైరెక్టర్ రామలక్ష్మి పేరి.

మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)