వీడియో: ఈ బామ్మ యోగా ఎలా చేస్తున్నారో చూశారా?
తమిళనాడు యోగా బామ్మ నానమ్మల్‌కు భారత ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. ఈ నేపథ్యంలో యోగాతో తనకున్న అనుబంధాన్ని ఆమె బీబీసీ తెలుగుతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె బీబీసీతో తెలుగులో మాట్లాడారు.

చిన్నప్పుడు తన తాత దగ్గర ఆసనాలు వేయడం నేర్చుకున్నానని, అప్పటి నుంచి తన జీవితంలో యోగా భాగమై పోయిందని ఆమె చెప్పారు.
''ఒకసారి నేను ఆసనాలు వేయడం మా అత్తమ్మ చూశారు. నీ భార్య పని చేయకుండా కాళ్లు, చేతులు ఊపుతోంది అని మా ఆయనతో చెప్పారు. దీంతో వాళ్లిద్దరూ కోపంతో కొన్నాళ్లు నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత మా అత్తమ్మకు నడుం నొప్పి వస్తే యోగా చేయించి ఉపశమనం కలిగించా'' అని నాటి ఘటనలను ఆమె బీబీసీతో పంచుకున్నారు.
ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం పట్ల తన కంటే తన పిల్లలు, బంధువులే ఎక్కువ సంతోషిస్తున్నారని నానమ్మల్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రధాని మోదీ దావోస్ ఎందుకు వెళ్తున్నారు?
- దావోస్లో మోదీ: ప్రపంచం ముందున్న సవాళ్లు ఇవే!
- పెరుగు తింటే వందేళ్లు జీవిస్తారా?
- BBC SPECIAL: అంధులు క్రికెట్ ఎలా ఆడతారు?
- నా కోరికకు, నా వైకల్యానికీ ఏ సంబంధమూ లేదు
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- అభిమానుల అండ ఒక్కటే సరిపోతుందా?
- దక్షిణాదిలో నిరసన స్వరాలు.. బాలీవుడ్లో మౌన రాగాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)