You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీ: కాలుష్య నివారణకు రూ.20 లక్షల భారీ యంత్రం
దిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం నుంచి ప్రజలకు ఉపశమనం కలగనుందా?
ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నిస్తోంది.
కాలుష్యంతో కూడిన పొగమంచును తొలగించేందుకు ఒక భారీ యంత్రాన్ని ఉపయోగించనుంది.
దీనిని స్మాగ్ గన్ అంటున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా దీని పనితీరును పరిశీలిస్తున్నారు.
ప్రత్యేకతలు
- ఇది ప్రపంచంలోనే అతి పెద్దది
- ఒక నిమిషంలో 100 లీటర్ల నీటిని వెదజల్లుతుంది
- 150 మీటర్ల దూరం వరకు నీటిని చిమ్మగలదు
- 95 శాతం వరకు గాలిని శుభ్రపరుస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు
- ఒకో యంత్రం ఖరీదు సుమారు రూ.20 లక్షలు
- వీటిని క్లౌడ్ టెక్ అనే సంస్థ ఉత్పత్తి చేస్తోంది.
తక్షణ అవసరం
కాలుష్యం నుంచి తక్షణమే ఉపశమనం పొందాలంటే ఇలాంటి యంత్రాలు ఎంతో అవసరమని క్లౌడ్ టెక్ డైరెక్టర్ విమల్ సైనీ చెబుతున్నారు.
ప్రపంచంలోని అతి కాలుష్య నగరాల్లో బీజింగ్ కూడా ఒకటి.
ఇక్కడ గాలిని శుభ్రపరిచేందుకు 2014లో చైనా ఇటువంటి యంత్రాలను ప్రయోగాత్మకంగా పరీక్షించింది.
కానీ వీటి ఖరీదు చాలా ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి.
దిల్లీ అంతటా ఉపయోగిస్తాం
ప్రస్తుతం ఈ యంత్రాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సత్ఫలితాలు వస్తే భవిష్యత్తులో దిల్లీ అంతటా వీటిని ఉపయోగిస్తామని వెల్లడించారు.
దిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరుగుతూ పోతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకంటే 30 రెట్లు అధికంగా కాలుష్యం ఉంది.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)