You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బాలీవుడ్: ప్రియాంక చోప్రా చదవని ఈ మెయిల్స్ 2,57,623
మీరు చదవకుండా పెండింగ్‌లో ఉన్న ఈ-మెయిల్స్ ఎన్ని? 50? 100? 1,000? అందాజుగా ఎన్ని మెయిల్స్ మీకోసం వేచి ఉన్నాయో చెప్పగలరా.. ఎన్ని ఉన్నా మీరు ప్రియాంక చోప్రా రికార్డును మాత్రం అందుకోలేరు.
ఎందుకంటే.. ప్రియాంక చోప్రా ఇన్‌బాక్స్ 2,50,000 మెయిల్స్‌తో నిండిపోయింది.
ప్రియాంక చోప్రా బాలీవుడ్ నటి. 50 సినిమాల్లో నటించిన ప్రియాంక హీరోయిన్‌గా చాలా పాపులర్.
2000లో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించున్నాక ఆమె హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది. యునిసెఫ్ ప్రచార కార్యకర్త కూడా.
2,57,623 మెయిల్స్‌తో ప్రియాంక చోప్రా ఇన్‌బాక్స్ నిండిపోయిన ఫోటోను ఆమె సహ నటుడు, అమెరికన్ అయిన అలన్ పోవెల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అలన్ పోవెల్ ప్రియాంక చోప్రాతో కలిసి అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ‘క్వాన్టికో’లో నటిస్తున్నారు.
అన్‌రెడ్ ఈ-మెయిల్స్‌తో ప్రియాంక చోప్రాను ఎవరైనా బీట్ చేయగలరా? అంటూ పోవెల్ ఛాలెంజ్ చేశారు.
దీంతో ఒక్కసారిగా ప్రజలు తమ తమ మొబైల్ ఫోన్లలో చదవాల్సిన మెయిల్స్‌ను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలు పెట్టారు.
కానీ చాలా కొద్ది మంది మాత్రమే 10,000 మార్క్‌ను దాటగలిగారు.
సందీప్ అనే వ్యక్తి.. తన మూడు వేరు వేరు అకౌంట్ల ద్వారా 60,000 పెండింగ్ మెసేజ్‌లు ఉన్నట్టు ఫోటో పోస్ట్ చేశారు.
ఈ సరదా పోటీలో పియుష్ రకాకు గ్రాండ్ ప్రైజ్ దక్కుతుంది. ఎందుకంటే ఇతడి మెయిల్ ఇన్‌బాక్స్‌లో 3,81,753 చదవాల్సిన మెసేజ్‌లున్నట్టు ఫోటో పోస్ట్ చేశారు.
అయితే.. డిజిటల్ ట్రిక్‌తో ఇలాంటి మ్యాజిక్‌లు చేయవచ్చంటూ ట్విటర్‌లో చాలా మంది ప్రశ్నలు లేవనెత్తారు.
కొందరైతే.. ఈ-మెయిల్ అకౌంట్‌ను డిలీట్ చేసుకోమని ప్రియాంకకు సలహా ఇచ్చారు కూడా!
కంగారు పడక్కరలేదులేండి.. ఐ ఫోన్ వాడే వారు సెట్టింగ్స్‌లోకి వెళ్లి, అన్‌రెడ్ మెయిల్ నంబర్ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవచ్చు.
ప్రియాంక చోప్రా పెండింగ్ మెసేజుల్లోని మొదటి కామాను చూడగానే.. ఆ పోస్టుపై కొందరు అనుమానం వ్యక్తం చేశారు.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ పోవెల్ పోస్టుకు - అసలు ఈ సంఖ్య నిజమా లేక ఊహనా? అంటూ రిప్లై ఇచ్చారు.
కానీ.. ఫోటోలోని సంఖ్య విధానం భారతీయ సంఖ్యావిధానంలాగానే ఉంది. ఉదాహరణకు విదేశాల్లో 'లక్ష'ను 100,000 అని రాస్తే, భారత దేశంలో 1,00,000 అని రాస్తారు.
మొత్తానికి ప్రియాంక చోప్రా 2.5 లక్షల ఈ-మెయిల్స్ చదవాల్సి ఉందన్నమాట!
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)