You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అంబేడ్కర్‌పై మహారాష్ట్రలో 2,400 పాటలు
భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీ ఛైర్మన్ బీఆర్ అంబేడ్కర్ కన్నుమూసి ఆరు దశాబ్దాలైనా, మహారాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో ఆయన్ను గుర్తు తెచ్చుకుంటూ ఎంతో ఉద్వేగంగా పాటలు పాడతారు.
అంబేడ్కర్ పట్ల దళితులకు, ముఖ్యంగా మహిళలకు ఉన్న గౌరవాభిమానాలను, కృతజ్ఞతాభావాన్ని చాటేలా ఈ పాటలు ఉంటాయి.
అంబేడ్కర్‌పై పాడే 2,400కు పైగా పాటలను తాము సేకరించినట్లు 'పరి (పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా-పీఏఆర్ఐ)' సంస్థ చెప్పింది. 31 గ్రామాల్లో 51 మంది వీటిని ఆలపించినట్లు చెప్పింది. ఈ పాటలను 'ఓవీలు' అని వ్యవహరిస్తారని తెలిపింది.
భీమ్, భీమ్‌బాబా, భీమ్‌రాయా, బాబాసాహెబ్ అని అంబేడ్కర్ అభిమానులు ఆయన్ను ఆప్యాయంగా పిలుచుకుంటారు. సమానత్వం కోసం ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ ఎంతో గర్వపడతారు.
అంబేడ్కర్ పాటలు పాడేవారిలో 60 ఏళ్ల లీలాబాయి షిండే ఒకరు. ఒక పాటలో అంబేడ్కర్‌ను ఆమె తన గురువుగా, సోదరుడిగా, మార్గదర్శకుడిగా అభివర్ణిస్తారు. పుణె జిల్లా ముల్షీ తాలూకా లావార్డే గ్రామానికి చెందిన ఆమె వ్యవసాయం చేస్తారు.
అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో జన్మించారు. ఆయన 65 ఏళ్ల వయసులో 1956 డిసెంబరు 6న దిల్లీలో కన్నుమూశారు.
ఇతర కథనాలు:
- 'మాయావతి 2006లోనే ఎందుకు బౌద్ధం స్వీకరించలేదు?'
- మోదీ-అమిత్ షా ద్వయాన్ని ఎదుర్కోగల ప్రతిపక్షమేదీ?
- ఆక్స్ఫర్డ్.. కేంబ్రిడ్జ్.. స్టాన్ఫర్డ్ల్లో ఉచితంగా చదువుకోవాలనుందా!
- ఇది అంబేడ్కర్ చదువుకున్న పాఠశాల
- క్విజ్: డాక్టర్ అంబేడ్కర్ గురించి మీకెంత తెలుసు?
- హైదరాబాద్ మెట్రోలో ఒక రోజు ప్రయాణం..
- 'సావిత్రికి అభిమానిని.. ఆ తర్వాతే అల్లుడిని!'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)