26/11 ముంబయి దాడులు: కసబ్ షూట్ చేస్తే ఆ చిన్నారి కాలికి గాయమైంది, అయినా ఆమె సాక్ష్యం చెప్పడానికి భయపడలేదు
2008 నవంబర్ 26న ముంబయిలో మారణహోమం సృష్టించిన ఉగ్రవాదుల్లో అజ్మల్ కసబ్ ఒకరు. ఎంతోమందిని కాల్చి చంపిన కసబ్, ఈ బాలికనూ షూట్ చేశాడు. బుల్లెట్ కాలికి తగలడంతో అదృష్టవశాత్తు ఆమె బతికి బయటపడింది.
భద్రతాదళాలకు కసబ్ ప్రాణాలతో పట్టుబడ్డాడు. అతడిని దోషిగా నిరూపించేందుకు కోర్టులో సాక్ష్యం చెప్పింది ఈ బాలికే. అప్పుడు ఈమె వయసు తొమ్మిదేళ్ల 11 నెలలు మాత్రమే.
ఆ దాడులు తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసాయో.. ఆమె బీబీసీకి వివరించింది.
(ఈ వీడియో చిత్రీకరణ, ఎడిటింగ్: మయూరేశ్ కొన్నూర్, జాన్హవీ మూలె, షరద్ బధే)
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)