శిధిలావస్థకు చేరిన అంబేడ్కర్ చదువుకున్న పాఠశాల

ఇది చారిత్రక ప్రాధాన్యం ఉన్న పాఠశాల. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఇక్కడే చదివారు. మరి ఆయన చదువుకున్న పాఠశాలంటే ఎలా ఉండాలి? ఇప్పుడెలా ఉంది? నేడు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా ఈ స్కూల్‌ను ఓ సారి చూసొద్దాం రండి.

పాఠశాల

ఫొటో సోర్స్, Lokesh Gavate

ఫొటో క్యాప్షన్, 1900లో నవంబరు 7న డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ సతారాలోని ఈ ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఇప్పుడీ పాఠశాల ప్రతాప్ సింగ్ హైస్కూల్‌గా మారింది. అప్పట్లో ఈ పాఠశాలలో కేవలం నాలుగు తరగతులు మాత్రమే ఉండేవి. అంబేడ్కర్ ఇక్కడ నాలుగో తరగతి వరకూ చదివారు.
పాఠశాల

ఫొటో సోర్స్, Lokesh Gavate

ఫొటో క్యాప్షన్, ప్రతాప్ సింగ్ హైస్కూల్ రజ్వాడా ప్రాంతంలోని ఓ భవనంలో ఉంది. ఈ భవనం చాలా చారిత్రక ప్రాముఖ్యత సంతరించుకొంది. 1824లో ఛత్రపతి శివాజీ వారసుడైన ప్రతాప్ సింగ్ రాజే భోస్లే ఈ పాఠశాలను స్థాపించారు. అప్పట్లో రాజ కుటుంబంబానికి చెందిన మహిళలు చదువుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు. 1851లో ఈ భవంతి పూర్తి పాఠశాలగా మారి బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళింది.
రిజిస్టర్‌

ఫొటో సోర్స్, Lokesh Gavate

ఫొటో క్యాప్షన్, అంబేడ్కర్ తండ్రి సుబేదార్ రాంజీ సక్‌పాల్ ఆర్మీ నుంచి పదవీ విరమణ పొంది సతారాలోనే ఉండిపోయారు. అప్పుడు అంబేడ్కర్ వయసు 6 ఏళ్ళు. భీవా(అంబేడ్కర్ చిన్ననాటి పేరు) సతారా ప్రభుత్వ పాఠశాలలో చేరారు. ఆయన చేరిక సమయంలో అంబావడే గ్రామం పేరుతొ అంబేడ్కర్ పేరును ఇంటిపేరుగా చేర్చారు. అంబేడ్కర్‌కు ఈ పాఠశాలలో కృష్ణాజీ కేశవ్ చదువు చెప్పారు. అంబేడ్కర్ ఆయన ఇంటిపేరుగా ఉండేది.
రిజిస్టర్‌

ఫొటో సోర్స్, Lokesh Gavate

ఫొటో క్యాప్షన్, పాఠశాల రిజిస్టర్‌లో భీవా అంబేడ్కర్ పేరుతొ ఆయన పేరును నమోదు చేశారు. ఆయన రిజిస్ట్రేషన్ నంబరు 1914. పేరుకు పక్కనే అంబేడ్కర్ సంతకం కూడా ఉంది. ఇంతటి ప్రాముఖ్యత పొందిన ఈ రిజిస్టర్ ఇప్పటికి ఈ పాఠశాలలో భద్రంగా ఉంది.
పాఠశాల

ఫొటో సోర్స్, Lokesh Gavate

ఫొటో క్యాప్షన్, ఈ పాఠశాల 1951లోనే వందేళ్లు పూర్తి చేసుకుంది. అప్పుడు ఈ పాఠశాల పేరును ఛత్రపతి ప్రతాప్ సింగ్ హైస్కూల్‌గా మార్చారు.
పల్లవి రామచంద్ర్ పవార్

ఫొటో సోర్స్, Lokesh Gavate

ఫొటో క్యాప్షన్, "భారతరత్న డాక్టర్ భీంరావ్ అంబేడ్కర్ చదువుకున్న పాఠశాలలోనే నేను కూడా చదువుకుంటున్నాను. దీన్ని గర్వంగా భావిస్తాను. ఏటా ఇక్కడ అంబేడ్కర్ జయంతి, ప్రవేశ రోజు ఉత్సవాలను జరుపుకుంటాం. అంబేడ్కర్ ఎన్నో కష్టాలెదుర్కొని చదివారు. నాకు కూడా ఆ కష్టాల గురించి తెలుసు. ఎందుకంటే మా అమ్మ కూడా ఇళ్లల్లో పాచిపని చేస్తుంటుంది. నాన్న ఓ పెయింటర్. నేను పెద్దయ్యాక కలెక్టర్ కావాలనుకుంటున్నాను." అని ఇక్కడ పదోతరగతిలో ఉన్న పల్లవి రామచంద్ర్ పవార్ తెలిపింది.
విరాజ్ మహీపతి సేనావాలె

ఫొటో సోర్స్, Lokesh Gavate

ఫొటో క్యాప్షన్, "నేను ప్రతిరోజూ ఉదయం పేపర్లమ్ముకొని ఇక్కడ చదువుతున్నాను. అప్పుడు నేను అంబేడ్కర్ పడిన కష్టాలను గుర్తుచేసుకుంటాను. ఆయన పడిన కష్టాల ముందు నా కష్టమెంత అని నేను ప్రశ్నించుకుంటాను. అంబేడ్కర్ చదివిన పాఠశాలలోనే చదువుకోవడం ఆనందంగా ఉంది. అంబేడ్కర్‌లా నాకు కూడా సమాజం కోసం ఏదోఒకటి చేయాలని ఉంది." అని విరాజ్ మహీపతి సేనావాలె తెలిపాడు. ఇప్పడతను ఈ పాఠశాలలో 10వ తరగతిలో ఉన్నాడు.
ప్రిన్సిపల్

ఫొటో సోర్స్, Lokesh Gavate

ఫొటో క్యాప్షన్, "ప్రతాప్ సింగ్ హై స్కూల్లో పేద విద్యార్థులు కష్టపడి చదువుతున్నారు. అంబేడ్కర్ వారసత్వాన్ని సంరక్షిస్త్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడీ పాఠశాలకు పూర్తిస్థాయి ప్రధానోపాధ్యాయుడి అవసరం ఉంది. పాఠశాల భవనాలు శిధిలావస్థకు చేరాయి. కొత్త భవనాల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మేము కృషి చేస్తున్నాం." అని పాఠశాల ప్రిన్సిపల్ ఎస్‌జీ ముజావర్ తెలిపారు.
పాఠశాల

ఫొటో సోర్స్, Lokesh Gavate

ఫొటో క్యాప్షన్, కొద్ది సంవత్సరాల కిందట ఈ పాఠశాల భవనాన్ని పురాతన భవనాల జాబితాలో ప్రజా పనుల శాఖ చేర్చుతూ పాఠశాల భవనాన్ని మార్చాలని సిఫారసు కూడా చేసింది. ఈ భవంతి చారిత్రక వారసత్వంగా పరిగణించబడింది.