You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
హిమాచల్ ఎన్నికలు సరే.. గుజరాత్‌లో ఎప్పుడు?
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు తేదీలను వెల్లడించింది.
మొత్తం 68 నియోజకవర్గాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబరు 9న జరగనున్నాయి.
దీనికోసం 7479 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 49.05 లక్షల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను సైతం ఈ లోపే పూర్తి చేసి, రెండు రాష్ట్రాలకు ఒకేసారి డిసెంబరు 18న ఓట్ల లెక్కింపు జరుపుతామని ప్రకటించింది.
కానీ గుజరాత్ ఎన్నికల తేదీలను మాత్రం వెల్లడించలేదు.
హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటినుండే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కమిషనర్ వెల్లడించారు.
- నోటిఫికేషన్ విడుదల తేదీ - 16.10.2017
- నామినేషన్లకు చివరి తేదీ - 23.10.2017
- నామినేషన్ల పరిశీలన - 24.10.2017
- నామినేషన్ల ఉపసంహరణకు గడువు - 26.10.2017
- పోలింగ్ - 09.11.2017
- ఓట్ల లెక్కింపు - 18.12.2017
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)