వేలాది రోహింజ్యా శిబిరాలు చూపిస్తున్న డ్రోన్ కెమెరా
మయన్మార్ నుంచి వలస వెళ్తున్న చాలామంది రోహింజ్యాలు బంగ్లాదేశ్ సరిహద్దులో శిబిరాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నారు. ఆ శిబిరాలు ఏ స్థాయిలో విస్తరించాయో చూపించేందుకు డిజాస్టర్ ఎమర్జెన్సీ కమిటీ ఓ వీడియోని డ్రోన్ కెమెరా సాయంతో చిత్రించింది.
రోహింజ్యాలకు సాయపడేందుకు నిధులు సేకరించే ఉద్దేశంతో, వాళ్ల పరిస్థితిని కళ్లకు కట్టేలా బంగ్లాదేశ్ సరిహద్దులోని బాలుఖలి శిబిరాల వీడియోను డీఈసీ రూపొందించింది.
ఇప్పటిదాకా 5లక్షలకుపైగా రోహింజ్యాలు మయన్మార్‌ని వదిలి వెళ్లారు. వాళ్లలో చాలామంది ఇలాంటి శిబిరాల్లోనే తలదాచుకుంటున్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లోనూ సబ్‌స్క్రైబ్ చేయండి.)